నేడు దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ రానే వచ్చింది. నిర్మల సీతారామన్ అనర్గళంగా మూడు గంటల పాటు చదివి వినిపించిన బడ్జెట్ లో అనేక లొసుగులు ఉన్నాయి అన్నది ఆర్థిక శాస్త్ర నిపుణుల అంచనా. అయితే బడ్జెట్ లో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల కి తీవ్రమైన అన్యాయాన్ని చేశారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అటు తెలంగాణలో బిజెపి అధికార టీఆర్ఎస్ పార్టీకి బద్ధ శత్రువు కావడం వల్ల మోదీ కెసిఆర్ రాష్ట్రానికి అసలు ఎటువంటి చెప్పుకోదగ్గ నిధులను వదలలేదు. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా పవన్ తో పొత్తు పెట్టుకున్న ఒక వారానికి బడ్జెట్ విడుదల కావడం కూడా ఏపీ రాష్ట్రాన్ని విపరీతంగా ముంచేసింది.

 

తెలంగాణలో అంటే టీఆర్ఎస్ పార్టీకి కేవలం తొమ్మిది మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా కేంద్రంలోని మోడీ పై ఒత్తిడి తీసుకొనిరాలేకపోయారు. ఒక విజయసాయిరెడ్డిని మినహాయించి ఎవరూ అక్కడ పార్లమెంట్ లో గళం ఇవ్వకపోవడం ఇక్కడ ఆలోచించదగ్గ విషయం. జగన్ తండ్రికి తగ్గ తనయుడిగా విప్లవాత్మక పథకాలను తీసుకొని రావడంలోనే తన జోరుని చూపించకుండా ఇక్కడ కూడా తన ఎంపీల సత్తా వాడుకొని కేంద్రంలో కూడా తను గుర్తించదగిన నేతగా ఎదగడంలో జగన్ విఫలం కావడం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుపై అందరికీ సందేహాలను రేపుతోంది.

 

గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి…. కాంగ్రెస్ కేంద్రంలో పాలనలో ఉన్నప్పుడు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి సోనియాగాంధీని రాష్ట్రానికి ఏది కావాలన్నా లేదనకుండా బదులిచ్చేలా చేశాడు. అప్పుడు దాదాపు 30కి పైగా ఎంపీలు రెండు తెలుగు రాష్ట్రాల నుండి పార్లమెంటులో ఉండడంతో వైయస్సార్ అడిగిన దానిని సోనియా లేదనకుండా ఇచ్చింది. అప్పుడు వచ్చినవే రామాయపట్నం పోర్టు నైజాం పట్టణం పోర్టు మరియ ఇంకెన్నో. కానీ ఇప్పుడు జగన్ రాష్ట్రంలో 22 మంది ఎంపీలను పెట్టుకుని ఏమీ చేయలేకపోవడంతో ఎప్పుడెప్పుడా అని దక్షిణ భారతదేశం మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టే బిజెపికి అవకాశం దొరికినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: