ఈనెల 4వ తేదీ నుండి మార్చ్ 13 వరకు జరిగే మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ తో క్షేత్ర విశిష్టతను తెలుపుతూ ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర గల మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని గత పాలకవర్గాలు విస్మరించడంతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

తెరాస అధికారంలోకి వచ్చాక  మన్యంకొండ క్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.ఆ క్రమంలోనే కొత్త ఆర్చి నిర్మించినట్లు తెలిపారు.అలివేలుమంగా దేవస్థానం ముందు నూతన కల్యాణ మంటపాన్ని కూడా నిర్మించినట్లు తెలిపారు.మన్యం కొండ గుట్ట పైకి వెళ్లి రావడానికి ఒకే మార్గం ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది గమనించిన భక్తుల ఇక్కట్లు తీర్చడానికి రెండవ ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు తెలిపారు.అలివేలు మంగ దేవస్థానానికి దగ్గరలోనే ఏసీ ఫంక్షన్ హాల్ తరహాలో అన్ని శుభ కార్యాలు జరుపుకోవడానికి వీలుగా అధునాతన భవన నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

 

మన్యంకొండ క్షేత్రానికి అత్యంత సమీపంలోనే గత ప్రభుత్వాలు గుర్తించలేదని పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర గల తమ హయాంలో ఆలయ  పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు.మన్యం కొండ గుట్టపై గతంలో భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానాలు చేయడానికి కూడా పుష్కరిణిలో నీళ్లు ఉండేవి కావని.... కానీ ప్రస్తుతం మిషన్ భగీరథ ప్యూరిఫై  కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం మూలంగా పుష్కరిణిలో 365 రోజులు పుష్కలంగా నీళ్లు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

 


 భవిష్యత్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ , మీ  సహకారం ఉంటే మన్యం కొండను మరో యాదాద్రిలా తీర్చిదిద్దుతామన్నారు.
మంత్రి ఈ సందర్భంగా కేటీఆర్ కు ఆహ్వాన పత్రికను అందివ్వగ బ్రహ్మోత్సావాలకు ఖచ్చిత0గా హాజరు అవుతానన్నారు. క్షేత్ర అభివృద్ధికి మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ చేస్తోన్న కృషి అభినందనీయం అన్నారు. అనంతరం ఆలయ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లను వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించారు. మంత్రి వెంట ఆలయ ధర్మకర్త మధుసూదన్, ఈవో పీ.వెంకట చారి తదితరులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: