అధికారం కోసం కాదు ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానని 2014 ఎన్నికల్లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. దీంతో ప్రస్తుతం బిజెపి పార్టీతో చేతులు కలిపి వరసగా సినిమాలు ఒప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఏం మాట్లాడకుండా కేవలం తన పార్టీకి సంబంధించిన జేడీ లక్ష్మీనారాయణ మరియు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు బెజవాడ నగరంలో. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్  విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొండిచేయి చూపించడం జరిగింది.

 

విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విషయంలో కూడా న్యాయం చేయకుండా అన్యాయం చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బిజెపి పార్టీ ఏపీ పట్ల వ్యవహరించిన తీరుపై బడ్జెట్లో కేటాయించిన తీరు పై తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. ఇటువంటి తరుణంలో బీజేపీ పార్టీని నిలదీయాల్సిన పవన్ కళ్యాణ్ విజయవాడ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏమాత్రం బడ్జెట్ విషయం ప్రస్తావనకు తీసుకు రాకుండా తన పార్టీ మునిగి పోతుంది అని ఎవరికోసమో నేను రాజకీయాల్లోకి రాలేదని ప్రాధేయ పడాల్సిన అవసరం నాకు లేదని..కబుర్లు చెబుతూ బడ్జెట్ విషయంలో బిజెపి పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి ప్రస్తావన తీసుకు రాకపోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పవన్ వైఖరి పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

అమరావతి విషయంలో మరియు ఇంకా అనేక విషయాల్లో ఢిల్లీలో ఉన్న పెద్దలను కడిగిపారేసి న్యాయం చేస్తానని కాలర్ ఎగరేసే విధంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ అసలైన బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగితే నోరు ఎందుకు మెదపడం లేదని చాలామంది ఇటీవల ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అసలు రాష్ట్రానికి బడ్జెట్ విషయంలో బిజెపి  తీవ్రంగా అన్యాయం చేస్తే ప్రశ్నించకుండా తన పార్టీ గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ మరికొంతమంది మొండి చేయి బడ్జెట్ పై పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును ఎండగట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: