2019 ఎన్నికల్లో వైసీపీకి అత్యధిక సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో వెస్ట్ గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇందులో 13 అసెంబ్లీ, ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే వెస్ట్ నియోజకవర్గాలు కొన్ని ఉన్న రాజమండ్రి స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఇన్ని సీట్లు ఇచ్చారు కాబట్టే సీఎం జగన్ జిల్లాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. జిల్లాకు ఒక డిప్యూటీ సీఎం పదవి, రెండు మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

 

ఏలూరు నుంచి గెలిచిన ramakrishna REDDY' target='_blank' title='ఆళ్ళ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆళ్ళ నానికి ఆరోగ్య శాఖతో పాటు, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. అటు ఆచంట నుంచి గెలిచిన రంగనాథ రాజుకు గృహ నిర్మాణ శాఖ, కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనితకు శిశు సంక్షేమ శాఖ ఇచ్చారు. అలాగే పలు సంక్షేమ పథకాలని ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నారు. అయితే ఈ విధంగా జరుగుతున్న, వెస్ట్ వైసీపీ నేతలకు ఒకరి విషయంలో బాగా అసంతృప్తి రేగుతుంది అంటా. జిల్లాలోని ఓ మంత్రి మరి డామినేట్ చేస్తూ, తమకు ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అసంతృప్తి రాగాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.

 

అసలు మంత్రి ఒంటెద్దు పోకడలతో పోతూ తమని పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేలు లోలోపల ఫీల్ అవుతున్నారట. అయితే ఎమ్మెల్యేలతో పాటు, తాజాగా ఎంపీలు కూడా ఓ విషయం గురించి ఆ మంత్రి తీరుని తప్పుబడుతున్నారు. ఇటీవల జిల్లాలో మంత్రుల సమక్షంలో డి‌డి‌ఆర్‌సి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రోటోకాల్ ప్రకారం తమకు గౌరవం దక్కలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమని స్టేజ్ మీద కూర్చోబెట్టకుండా, వేదిక కింద ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవాలని తనను అవమానించారని ఆవేదన చెందారు.

 

అంతటితో ఆగకుండా సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్ళిపోయారు. ఈయనని అనుసరిస్తూ...ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌లు బయటకు వెళ్ళిపోయారు. ఇదే విషయంపై రఘు...జగన్‌కు కూడా లేఖ రాసినట్లు సమాచారం. మొత్తానికి ఓ మంత్రి వ్యవహారం వెస్ట్‌లోని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు నచ్చడంలేదని తెలుస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: