చిరుతపులి ఎదుట పడితే ఎవరైనా ఏం చేస్తారు. భయంతో పరుగులు తీస్తారు. ఇక చిరుత పులి దాడి చేసింది అంటే వారి పరిస్థితి ఇక అంతే ప్రాణాలు గాలిలో కలిసి పోయినట్లే. అయితే చిరుత దాడి నుంచి తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక్కసారి చిరుత దాడి చేసింది అంటే ప్రాణాలు  పోక తప్పదు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం చిరుత తనపై దాడి చేయడంతో ఎక్కడ భయపడలేదు. ఆ మహిళ చిరుత తలపడి మరియు తన ప్రాణాలను రక్షించుకోండి. తనపై దాడి చేసి చిరుత గాయపరిచినప్పటికి పట్టు విడవకుండా... చిరుత పులి కి చుక్కలు చూపించండి. 

 

 

 తన ప్రాణాలను రక్షించుకోవటమే కాదు  అందరికీ ఆదర్శంగా నిలిచింది ఇక్కడ ఒక మహిళ. ఈ ఘటన నార్త్ బెంగాల్ లోని అల్లీపూరుద్వార్  జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం సమయంలో అనిత నగశియా  అనే మహిళ అళిపురుద్వార్  ద్ కాల్చిని  పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న... రాజ్ భట్ టీ  తోటలో పని చేసుకుంటుంది. అయితే ఈ మహిళ పనిలో నిమగ్నం అయిపోయింది. అదే సమయంలో నక్కి ఉండి  ఈ మహిళపై దాడి చేసేందుకు చిరుతపులి సిద్ధంగా ఉంది. ఇక  వెంటనే ఆ చిరుతపులి ఆమెపై దూకి దాడి చేసింది కూడా. 

 

 

 

 ఇక సడన్గా చిరుతపులి ఆమెపై దాడి చేయడంతో... ఆమె మొదట భయంతో  ఊగిపోయింది... ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని చిరుత పైకి తిరగబడింది. మహిళా  చేత్తో దాని ముఖం పై పిడిగుద్దులు కొట్టడం ప్రారంభించింది . ఇక ఐదు నిమిషాల పాటు సదరు మహిళకు చిరుత పులి కి మధ్య పోరాటం జరిగినది . మొదట ఆమె పిదిగుద్దులకు   చిరుత స్పందించక పోయినప్పటికీ చివరకు దెబ్బలు తాళలేక చిరుత వెనక్కి తగ్గింది. ఆ మహిళపై దాడి చేయడం ఆపి  పరుగులు పెట్టింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన అనితను  తోటి పనివాళ్ళు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఒక టీ తోటలలో  చిరుత  దాడులు మామూలు అయిపోయాయి అంటూ అక్కడ పనిచేసే వారు తెలుపుతున్నారు. ఇక్కడ ఈ తోటలో పని చేసే వారిలో... ఎప్పుడు ఎవరో ఒకరు చిరుత పులి బారిన పడుతూనే ఉన్నారు అంటే అక్కడ పనిచేసే కూలీలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: