ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రానికి తీసుకురావాలని తీర్మానించుకున్న నేపథ్యంలో ఉన్నఫలంగా ఆయన ఎవరూ ఊహించనంత దూకుడు కనబరుస్తున్నాడు. ఇప్పటికే హైకోర్టు మరియు జుడీషియల్ విభాగానికి సంబంధించిన అనేక డిపార్ట్మెంటు లను కర్నూలులో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చర్యలు మరియు అవసరమైతే బిల్డింగులను అద్దెకు తీసుకునే దిశగా వైసీపీ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇకపోతే జగన్ తీసుకున్న మరో కీలకమైన నిర్ణయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

ఈనెల మధ్య భాగంలో లేదా ఆఖరిలో ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ విశాఖకు తరలిపోతారు అని సమాచారం. ఏది ఏమైనా నేను పాలన అక్కడినుండి చేస్తాననినన్ను ఎవరు అవుతారో చూస్తానని జగన్ తన మొండి వైఖరిని కొనసాగించడం గమనార్హం. అంతకుముందు అసెంబ్లీలో జగన్ చెప్పినట్లు రాజ్యాంగబద్ధంగా సీఎం తనకు నచ్చిన చోటు నుండి చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి జగన్ అదే పద్ధతిని ఇప్పుడు పాటించబోతున్నాడు. ఇకపోతే విషయంపై అందరూ.... హైకోర్టు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటే దాని వద్ద కూడా జగన్ కు ఒక లాజిక్ ఉంది.

 

హైకోర్టు మీరు ఇలా ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. ఇంకా ఇలా చేయబోరేమో అని ఆశించింది కానీ మూడు రాజధానుల విషయమై మాత్రం ఎటువంటి స్టే విధించలేదు. ఇటువంటి కీలకమైన రాజకీయ సంఘర్షణ రాష్ట్రంలో ఏర్పడిన నేపథ్యంలో జగన్ తన నిర్ణయానికి ఓటు వేసుకొని కొనసాగుతుండడం ఇక్కడ గమనించదగ్గ విషయం. సీఎం అక్కడికి వెళ్తే పరిపాలనకు సంబంధించిన మిగతా శాఖలు అక్కడి నుంచి రావాలి కాబట్టి ఇప్పటికే దీనిపై అనేక అధికారులకు మరియు అతని నాయకులకు ఇప్పుడే కీలకమైన ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. చివరికి మూడు రాజధానులు విషయం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: