ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానిల ప్రకటన చేసినప్పటి నుంచి రాజధాని అమరావతి లో రైతులు నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వికేంద్రీకరణ కు సంబంధించిన బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపించిన కూడా.. ఇప్పటికి అమరావతి రైతుల నిరసనలు మాత్రం ఆగలేదు. ఇక తాజాగా రాజధాని ప్రాంతంలో దీక్ష చేస్తున్న రైతులను కలిసిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి... రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని కోసం ఎన్నో రోజుల నుండి అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

 

 చంద్రబాబు నాయుడు పై ఉన్న కోపంతో ఇంతమంది అమాయకపు రైతుల ఉసురు పోసుకుంటున్నారు  అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు జెసి దివాకర్ రెడ్డి. చంద్రబాబు పై నీకు కోపం వుంటే ఆయనను మొక్కలు మొక్కలు చెయ్ అంతే తప్ప... అమరావతి ప్రాంత రైతులను  మాత్రం దెబ్బతీయ్యొద్దు అంటూ  తీవ్ర వ్యాఖ్యలు చేశారు జెసి దివాకర్ రెడ్డి. తనపై కోపం ఉన్న తనను  నాశనం చేయాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించొద్దు  అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి. 

 

 

 ఒక మనిషికి మెదడు ఎంత ముఖ్యమో... ఒక రాజధానికి సెక్రటేరియట్ కూడా అంతే ముఖ్యం అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు దివాకర్ రెడ్డి. అలాంటి సెక్రటేరియట్  తీసుకెళ్లి విశాఖలో పెట్టాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు. ఇకపోతే అటు అమరావతి రైతులు రాజధాని అమరావతి లోని కొనసాగించాలంటూ చేస్తున్న నిరసనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే టిడిపి అమరావతి రైతులకు మద్దతు తెలుపుతుండగా... రోజురోజుకు మరింత ఉధృతంగా నిరసనలు తెలుపుతున్నారు అమరావతి రైతులు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల  నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరసనలు ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: