చంద్రబాబు కమ్మ జాతిని తొక్కేశారా.. ఇది నిజమేనా..అసలు ఈ మాట అనడానికి ఎవరికైనా ఎంత ధైర్యం ఉండాలి.. అసలు అన్నీ కమ్మవారికే కట్టబెడుతున్నాడని కదా.. చంద్రబాబుపై విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు చంద్రబాబే కమ్మవాళ్లను తొక్కేశాడని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది.. కానీ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. టీడీపీ నాయకుడే. ఆయనే జేసీ దివాకర్ రెడ్డి.

 

ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ కృష్ణ, గోదావరి జిల్లాల్లోని కమ్మవారిని చంద్రబాబు తొక్కేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. వయస్సు పైబడిన చాదస్తంలో ఇటీవల జేసీ దివాకర్ రెడ్డి తరచూ ఇలాంటి మాటాలు మాట్లాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో కొంత నిజం కూడా లేకపోలేదు. వాస్తవానికి కమ్మ వారి గత చరిత్ర చూస్తే ఎన్నో సంస్థలు నెలకొల్పి వ్యాపార రంగంలో వందల మందికి ఉపాధి కల్పించారు. కేవలం వ్యాపారమే కాదు.. సేవా రంగంలోనూ కమ్మవారిది పై చేయి గానే చెప్పుకోవాలి.

 

అయితే మారుతున్న తరంలో ఆ నాటి కమ్మ జాతి గొప్పదనం విలువలు నశిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకనాటి మానవత్వం, సేవా గుణం, వ్యాపార తత్వం తగ్గిపోయి.. తామే గొప్పవారమన్న అహంకార ధోరణి పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేకించి నేటి కమ్మ యువతరాన్ని కులపరమైన లక్షణాలతో పెంచడం.. మనం పాలకులం, మనం లేకుండా ఏదీ సాధ్యంకాదనే తరహాలో కుర్రాళ్ల మెదళ్లను కలుషితం చేశారన్న వాదన కూడా ఉంది.

 

విచిత్రమేంటంటే.. వాస్తవానికి తెలుగుదేశం హయాంలో కమ్మవాళ్లు బాగుపడ్డారన్నది వాస్తవమే. అయితే ఆ శాతం చాలా తక్కువ. కోటీశ్వరులైన 5 శాతం కమ్మవాళ్లు బాగుపడితే.. ఆ నిందను మిగిలిన 95 శాతం కమ్మవారు మోయాల్సి వచ్చిందన్నదే వాస్తవం అంటున్నారు విశ్లేషకులు. అంటే బాబు హయాంలో కమ్మవాళ్లు బాగుపడింది .కేవలం 5 శాతం మాత్రమే అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: