కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జె తెలుగు రాష్ట్రాలను నిరాశలో ముంచేసింది. ఆమె తెలుగింటి కోడలు అన్న విషయం తెలిసిందే. పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకోవడం ద్వారా ఈ తమిళ మహిళ.. తెలుగింటి కోడలు అయ్యారు. అయినా తెలుగు రాష్ట్రాలపై ఆమె ఏమాత్రం కరుణ చూపలేదు. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి మొండి చెయ్యి చూపించింది.

 

 

వ్యవసాయాధారిత ఆంధ్ర రాష్ట్రాన్ని బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశలు లేకపోయినా.. కనీసం వెనుకబడిన ఏడు జిల్లాలకు రావాల్సిన రూ.24,350 కోట్లలో కాస్తయినా విదులుస్తారని ఆశించినా ఆశాభంగామే అయ్యింది. ఈ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు నిరాశ కలిగించింది. రైతుల విషయానికి వస్తే బడ్జెట్‌లో 15 లక్షల కోట్ల రూపాయల అగ్రికల్చరల్‌ క్రెడిట్‌ అనౌన్స్‌ చేశారు. ఆంధ్రరాష్ట్రం వ్యవసాయాధారిత రాష్ట్రం కాబట్టి 15 లక్షల కోట్ల రూపాయాల్లో రాష్ట్రానికి చెందాల్సిన వాటా ఎలాంటి వివక్షత లేకుండా ఇవ్వాల్సి ఉంది. అది ఇస్తారో లేదో క్లారిటీ లేదు.

 

 

పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి ఫైనాన్స్‌ ఇప్పిస్తున్నప్పటికీ ప్రాజెక్టు మరిచిపోకుండా పోలవరం పేమెంట్స్‌ త్వరితగతిన రిలీజ్‌ చేయాల్సి ఉంది. దీనిపైనా స్పష్టమైన హామీ లేదు.ఇప్పటి వరకు ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా ఆంధ్రరాష్ట్రానికి ఇవ్వలేదు. వంద ఎయిర్‌పోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు.. ఆంధ్రరాష్ట్రానికి చెందాల్సిన వాటా గురించి ప్రస్తావన లేదు.

 

 

సీతారామన్ ద్వారా రాష్ట్రానికి ఎంతో సహాయం వస్తుంది ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రరాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి చూపించిందని స్పష్టంగా తెలుస్తుంది. మరి అత్త గారి రాష్ట్రంపై నిర్మలా సీతారామన్ కు అంత కోపం ఎందుకో.. మరి ఆంధ్రాకు జరిగిన ఈ అన్యాయంపై ఏపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో.. పార్లమెంటులో ఎలా ప్రశ్నిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: