దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ నిన్న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారు. అయితే ఈ కేంద్ర బడ్జెట్ లో కొన్ని రంగాలపై వరాల జల్లు కురిస్తే మరికొన్ని రంగాలకు మొండి చెయ్యి చూపించారు. అయితే బడ్జెట్ కి ముందు ఎన్నో చెప్పిన కేంద్రం బడ్జెట్ లో ఏమి లేదు అని తేలిపోయింది. 

 

నిజానికి.. నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండొవసారి అధికారంలోకి రావడంతో పాటు ఆర్ధికమంత్రి మహిళా కావడంతో బడ్జెట్ పై ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలపై.. అంచలనాలపై నీళ్లు చల్లింది బీజేపీ ప్రభుత్వం. వివరాల్లోకి వెళ్తే.. మన వృద్ధి రేటు ఎప్పుడు అయితే 5 శాతానికి అటూ ఇటూగా కొట్టుమిట్టాడుతోన్నసమయంలో దాన్ని 10 శాతం చేస్తాం అని చెప్పారో అప్పుడే అది ఉత్తర కుమార ప్రగల్బాలు అని తేలిపోయింది. 

 

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అంటే 2007 లోనే వృద్ధి రేటు నమోదు అయ్యింది.. ఇప్పుడు చూస్తే ఇలా.. దీన్ని చూస్తుంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కంటే కూడా అప్పుడు కాంగ్రెస్ ఏ నయం అని ఆర్ధిక విశ్లేషకులు కూడా చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వం కూడా వృద్ధి రేటు 10 శాతం చేస్తామ‌ని చెప్పారు కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో 6 శాతం అని చెప్తున్నారు. 

 

దీంతో ఊపందుకున్న ప్రతిపక్షాలు.. వీరి మాటలు అన్ని ఉత్త‌ర కుమార ప్ర‌గ‌ల్భాలు అని తేలిపోయింది అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరు చెప్పేవి ఒకటి చేసేవి ఒకటి అని దీంతో తేలిపోయింది.. ఇది అంత అసంభ‌వం అని.. వీరు చెప్పేవి అన్ని కాక‌మ్మ క‌థ‌లే అని అర్థ‌మైపోయింది అంటూ కేంద్రాన్ని ప్రతిపక్షం ఓ రేంజ్ ఆడుకుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: