పిడుగురాళ్లకు చెందిన ఓ వివాహితకు పదేళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కొడుకు ఉన్నాడు. మూడేళ్ల క్రితం భర్తతో ఏర్పడిన వివాదాల కారణంగా కుమారుడితో కలసి వేరుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సంపాదన లేకపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఏ పని చేసినా కుటుంబం గడవడానికే సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఆమెకు నరసరావుపేటలో వ్యభిచార గృహం నిర్వహించే మహిళతో పరిచయమైంది. తనకు ఉపాధి కల్పించాలని కోరడంతో ఆమె వ్యభిచారం చేయాలని ఉసిగొల్పింది. 

 

ఆమె సరేననడంతో నరసరావుపేట తీసుకెళ్లి మూడురోజుల పాటు తన ఇంట్లోనే ఉంచింది. కాంట్రాక్ట్ ప్రకారం డబ్బులు ముందే ఇవ్వాలని మహిళ కోరగా నిర్వాహకురాలు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు చెప్పడంతో ఆమె కంగారుపడింది. ఈ పంచాయతీ పోలీసుల వద్దకు చేరితో తమ బండారం బయటపడుతుందని ఆందోళన పడిన వ్యభిచార నిర్వాహకులు ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నారు.

 

జనవరి రెండో వారంలో డబ్బులు ఇస్తామని చెప్పి వ్యభిచార నిర్వాహకురాలు, ఆమె భర్త, ఓ విటుడు ఆమెను గుత్తికొండలోని సాగర్ కాలువ వద్దకు రప్పించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. మత్తులోకి జారుకున్న మహిళను కాలువలోకి తోసేశారు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిందని నిర్ధారించుకున్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

ఆమె ఫోన్‌ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా మిస్టరీ వీడింది. దీంతో వ్యభిచార గృహ నిర్వాహకురాలు, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమెను తామే హతమార్చినట్లు నిందితులు అంగీకరించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు సుమారు పదేళ్ల క్రితం చిలకలూరిపేటలో వ్యభిచార వృత్తి నిర్వహించడానికి వచ్చిన ఓ యువతి కూడా ఇలాగే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి ఆగడాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: