సమాజంలో మనిషిగా బ్రతకడం అనేది రోజు రోజుకు గగనంగా మారుతుంది. ఉన్నతమైన చదువులు వ్యక్తిలోని ఉన్నతమైనా భావాలను పెంపొందించలేక పోతున్నాయి.. ఇప్పుడు ప్రపంచాన్ని చూసుకుంటే అత్యంత ప్రమాదకరమైన విషపు కొరల్లో చిక్కుకుని ఉంది.. మనుషుల మధ్య పేరుకే జీవిస్తున్నా, చుట్టూరా రాక్షస సమూహాలే. ఇకపోతే ఈ మధ్యకాలంలో జరిగే దారుణాలు, ఇది సమాజమా.. ? అని ప్రశ్నించేలా ఉన్నాయి. అసహ్యహించుకునేలా ఉన్నాయి. మంచితనానికి తిమ్మిర్లు వచ్చి, ముసుకేసి పడుకోగా, అరాచకం, కౄరత్వం విచ్చలవిడిగా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంది.

 

 

ఇకపొతే  బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, దేశానికే కాదు ఇంటికి కూడా రక్షణగా ఉండాల్సిన ఒక పోలీస్, విచక్షణను కోల్పోయి కుటుంబసభుల్ని దారుణంగా హతమార్చిన ఘటన   జార్ఖండ్‌లోని రాంచీలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంచీకి చెందిన బ్రిజేశ్‌ తివారీ గత కొంత కాలంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా ఫుల్‌గా మద్యం సేవించిన ఇతను శనివారం తన ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబసభ్యుల్ని సుత్తితో కొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

 

 

అనంతరం పండారాలో నివాసం ఉంటున్న తన సోదరికి ఫోన్‌ చేసి. విషయం వివరించాడు. ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇక విషయం తెలుసుకున్న ఆ సోదరి అతని దగ్గరకు వెళ్లే సరికి జరగవలసిన దారుణం జరిగిపోయింది. అప్పటికే తివారీ చేతిలో తీవ్రంగా గాయపడ్డ ఆ ముగ్గురు చనిపోగా,  స్దానికుల హాయంతో ఆపస్మారక స్థితిలో ఉన్న తివారీని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తివారీ కూతరు వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉందని, ఇది కచ్చితంగా పరువు హత్యే అయ్యుంటుందని స్థానికులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: