నిర్భయ చనిపోయి ఏడేళ్లు దాటింది.  ఈ కేసులో నిందితులను పట్టుకొని కూడా ఏడేళ్లు అయ్యింది.  ఉరిశిక్ష విధించి ఆరేళ్లు అయ్యింది.  అయినప్పటికీ ఈ దోషులు ఇంకా బ్రతికే ఉన్నారు.  ఉరిశిక్ష పడిన తరువాత వారిని ఉరితీయాలని నిర్భయ తల్లి నిత్యం కోర్టు చుట్టూనే తిరుగుతూ ఉన్నది.  అయితే, తెలంగాణలో దిశ కేసు తరువాత నిర్భయ దోషులను ఉరితీయాలని పాటియాల కోర్టు డెత్ వారెంట్ రిలీజ్ చేసింది.  


జనవరి 22 న వారిని ఉరి తీయాలి.  అప్పటి నుంచే దోషులు చట్టాల్లోని లొసుగులు ఉపయోగించుకుంటూ చావు నుంచి తప్పించుకుంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. వరసగా పిటిషన్లు వేస్తూ చావును పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నారు.  జనవరి 22 న మరణశిక్ష విధించాల్సి ఉండగా రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ ఉండటంతో తప్పించుకున్నారు.  ఆ తరువాత పాటియాలా కోర్టు మరోసారి డెత్ వారెంట్ రిలీజ్ చేసి ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.  


అయితే, డెత్ వారెంట్ మరోసారి వాయిదా పడింది.  ఎందుకంటే, దోషులు మరలా పిటిషన్ దాఖలు చేసుకున్నారు.  మరొకరు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు.  ఇందులో ముగ్గురు దోషులు ఇప్పటి వరకు న్యాయపరమైన అన్ని అవకాశాలు వినియోగించుకున్నారు.  పవన్ అనే వ్యక్తి ఇప్పటి వరకు ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదు.  


దీంతో తరువాత నుంచి పవన్ మైండ్ గేమ్ ఆరంభిస్తారని అంటున్నారు.  ఎలా అన్నది తెలియాల్సి ఉన్నది.  ఒకవేళ పవన్ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోకుంటే మాత్రం త్వరలోనే ఉరి తీయాల్సి ఉంటుంది.  అలా కాకుండా అతను పిటిషన్ దాఖలు చేసుకుంటే మాత్రం ఉరి తీయాల్సి ఉంటుంది.  చూద్దాం ఏమౌతుందో.  ఇలా వాయిదాలు వేసుకుంటూ పొతే మాత్రం ఉరి ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది.  కానీ, ఏదో ఒక నాటికి ఉరితీయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: