చైనాలో గుర్తించబడిన ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి సోకితే అసలు వ్యాక్సిన్ కూడా లేకపోవటంతో  ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రపంచ దేశాలన్నీ వనికిపోతున్నాయి.. ఇక చైనా దేశంలో అయితే కరోనా  వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఎమర్జెన్సీని ప్రకటించింది. కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే చైనా దేశంలో వందల్లో ప్రాణాలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలో చైనాకు భారీ ప్రాణ నష్టంతో పాటు ఆర్ధిక నష్టం కూడా కలుగుతోంది. ప్రపంచ దేశాలు కూడా తమ దేశంలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

 

 

 కొన్ని దేశాలు చైనా దేశానికి వెళ్లే విమాన సర్వీసులను కూడా పాక్షికంగా రద్దు చేసాయి. మరికొన్ని దేశాలు విమానాల ద్వారా చైనా నుండి తమ దేశానికి వస్తున్నా పౌరులను విమానాశ్రయంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కరోనా  అనుమానితులు అని తేలితే వారికి ప్రత్యేకంగా  చికిత్సను అందిస్తున్నారు. ఇక పలు దేశాల్లో కరోనా అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజలందరూ బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే చైనా  సంచలన ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన కరుణా కు విరుగుడు దొరికింది అంటూ చైనా  ప్రకటన చేసింది. 

 

 

 

 కరోనా  వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే బాధితులు కోరుకుంటున్నారు అంటూ సంచలన ప్రకటన చేసింది చైనా. ఇప్పటికీ కరోనా  వైరస్ ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా వ్యాప్తి చెందడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా  వ్యాధి సోకిన వారిలో చికిత్స పొంది 243 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అంటూ చైనా వెల్లడించింది. ఇక కరోనా  వైరస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. కాగా కరోనా  వైరస్ సోకి ఇప్పటివరకు 259 మంది మరణించగా మరో 11 వేల మంది బాధితులు ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా చికిత్స పొందుతున్నారు. కాగా చైనా నుంచి వచ్చిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలన్నీ హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: