బుల్లి తెరపై తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు యాంకర్ ప్రదీప్. అద్భుతమైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ నెంబర్ వన్ యాంకర్ గా దూసుకుపోతున్నాడు. మొన్నటి వరకు బుల్లితెర పై పలు టీవీ ప్రోగ్రాములు సినిమా ఈవెంట్లలో వాక్చాతుర్యంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించి  అదరగొట్టిన యాంకర్ ప్రదీప్ ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు. కాగా హీరోగా ప్రస్తుతం షూటింగ్లో పాల్గొంటుండగా... ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న అని బుల్లితెర షోలకు  ప్రస్తుతం కాస్త గ్యాప్ ఇచ్చాడు. కాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో ప్రదీప్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 

 

 ఇకపోతే తాజాగా నటుడు యాంకర్ ప్రదీప్ పై ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజులు జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అని... ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిబంధనలకు విరుద్ధం అంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఓ యువ దర్శకుడు. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లి కు చెందిన శ్రీరామోజు  సునిషిత్ ... అనే యువ దర్శకుడు యాంకర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. గత నెల 31న తాను  టీవీ చూస్తూ ఉండగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు అనే విషయం తెలిసింది . 

 

 

 అయితే యాంకర్ ప్రదీప్ గతంలో ఓ అమ్మాయి ని వేధించిన ఘటనలో  రెండు రోజులకు జైలుకు వెళ్లి వచ్చారు.. ఈ క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ రూల్స్ కు వ్యతిరేకంగా రెండు రోజులు జైలుకు వెళ్ళొచ్చిన ప్రదీప్ ఏ సినిమాలో  హీరోగా నటించకూడదని... కానీ నిబంధనలకు విరుద్ధంగా హీరోగా ఓ సినిమాలో ప్రదీప్ నటిస్తున్నారు అంటూ ఆరోపించారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాను  ఆపేయాలి అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు యువ దర్శకుడు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసు ఫిర్యాదులు స్వీకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: