చైనాలో ఎంతో మంది ప్రాణాలను బలి కొన్ని ప్రపంచ దేశాలకు శర వేగంగా వ్యాప్తి చెందుతు... ప్రపంచ దేశాలన్నింటికీ గజ గజా వణికిస్తూ ఉన్న వైరస్ కరోనా . చైనాలో గుర్తించబడిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు అతి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు కనిపిస్తోంది. ఇక  అటు చైనా లో అయితే వందల మంది ప్రాణాలను బలిగొంది ఈ కరోనా  వైరస్. వేల సంఖ్యలో చైనాలో ఈ కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇక చైనాలో గుర్తించబడిన కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతు ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ... బెంబేలెత్తిపోతున్నారు. అంతేకాకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినది అంటే  కరోనా  వైరస్ ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మిగతా దేశాలు కూడా తమ దేశ పరిధిలోకి కరోనా  వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 

 

 

 ఇకపోతే ఈ వైరస్కు విరుగుడు మందు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇకపోతే గత కొన్ని రోజుల నుండి ఆవు మూత్రంతో కరోనా  వైరస్కు చెక్ పెట్టొచ్చు అని వార్తలు ఊపందుకున్నాయి. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి  కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం తో... ఆవు మూత్రం పై పెద్ద చర్చ జరుగుతోంది. గోమూత్రం పేడతో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు అని... శరీరం మొత్తం ఆవు పేడను రాసుకుని  ఎవరైతే ఓం నమశ్శివాయ అంటూ దేవుని స్మరిస్తారో  వారికి కరోనా వైరస్ సోకకుండా సురక్షితంగా ఉంటారు అని చక్రపాణి వ్యాఖ్యానించారు... అంతే కాకుండా ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాధి ని అంతం చేసేందుకు త్వరలో యాగం నిర్వహించనున్నాము అంటూ ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనం గా మారిపోయాయి. 

 

 

 ఇంకేముంది ఏదైనా చిన్న విషయం సోషల్ మీడియాలో నెటిజన్లకు దొరికింది అంటే దాన్ని వైరల్  చేసేస్తూ ఉంటారు. ఆవు మూత్రం పేడ తో కరుణ వైరస్ తగ్గుతుంది అంటూ ప్రచారం జరుగుతుండటంతో... ఆవు మూత్రాన్ని చైనాకు  ఎగుమతి చేసుకుంటున్నారు అంటూ వింత ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇక అనుమానితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో దేశ ప్రజలందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: