ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అంత ఏదానికి అయినా భయపడుతున్నారు అంటే అది ఖచ్చితంగా కరోనా వైరస్ కే అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ కరొన వైరస్ కారణంగా దాదాపు 300 మంది మృతి చెందారు.. దాదాపు 10 వేలమందికిపైగా ప్రస్తుతం ఈ చికిత్స బారిన పడ్డారు. చైనాలో పుట్టిన ఈ వైరస్..  వచ్చిన కొద్దీ రోజులకే ఎంతో దారుణంగా సోకుతుంది. అత్యంత వేగంగా అందరికి వ్యాప్తిస్తుంది. అలాంటి ఈ వైరస్ సోకకుండా దేశ ప్రజలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో ఈ వైరస్ భారిన ప్రజలు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి అవగాహనా కల్పిస్తున్నారు. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ఈ వైరస్ ఎంత ప్రమాదం అనేది వారు చెప్తున్నారు. అయితే ఈ తరహాలోనే తెలంగాణ నేతలు కూడా ఈ వైరస్ నివారణపై తగిన చర్యలు తీసుకోడానికి మొదలు పెట్టారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ రాకుండా ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం గాంధీనగర్ డివిజన్ లో టీఆర్ఎస్ నేతలు చేపట్టారు. అయితే అక్కడ వచ్చిన చిక్కు ఏంటి అంటే? వారు పెట్టిన ఫ్లెక్సీ లో కరోనా బదులు 'కోరుల్లా వైరస్' అని ప్రింట్ చేసారు. ఇది చూసిన ప్రజలు దాని ఫోటో తీసి సోషల్ మీడియా లో పెట్టారు. దీంతో కరోనా వైరస్ కంటే వేగంగా ఈ 'తెలుగు వైరస్' ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రజలు అంత ఒకే మాట.. కనీసం వైరస్ పేరు సరిగ్గా రాయలేని వారు మందులు ఇవ్వడం ఏంటయ్యా? అని అంటున్నారు. 

 

ఇంకా కొందరు నెటిజన్లు అయితే మరి రెచ్చిపోతున్నారు. ''అది కోరుల్లా వైరస్ కాదురా ఎర్రినాయల్లారా... అది కరోనా వైరస్. దానికి ఇంకా ప్రపంచంలోనే ఎక్కడ మందు కనిపెట్టలేదు.. మందు అంటే ఎం అనుకుంటున్నారు?అయ్యా అంటూ విరుచుకుపడుతున్నారు. ఒక్క ఈ ఫ్లెక్సీతో తెలంగాణ పరువు గంగలో కలిసిపోయింది అనే చెప్పాలి. మరి మీరు ఏం అంటారు? 

మరింత సమాచారం తెలుసుకోండి: