ఆర్టీసీ కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చేశారు. వారిని మెచ్చుకుంటున్నట్టు మెచ్చుకుంటూనే గట్టి హెచ్చరికలు పంపారు. అంతే కాదు.. సమ్మె కాలం నాటి పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. సమ్మెను జాగ్రత్తగా డీల్ చేయాలని కేసీఆర్ గట్టిగా చెప్పడంతో.. ఆర్టీసీ సమ్మె కాలంలో.. తాను ఏ ఒక్క రోజు కంటి నిండా నిద్రపోలేదన్నారు. ‘ఆ సమయంలో ఏ ఒక్క కార్మికుడు బలవన్మరణానికి పాల్పడొద్దు. తాత్కాలిక డ్రైవర్లతో నడుపుతున్న బస్సుల ద్వారా ఎలాంటి ప్రమాదం జరగొద్దు అని కోరుకున్నట్లు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ చెప్పారు.

 

ఆర్టీసీ ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తే.. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హెచ్చరించారు. వారికి మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అంకితభావంతో పని చేయాలని సూచించారు. సంస్థ పనితీరు మెరుగు అయ్యేందుకు పువ్వాడ అజయ్ కుమార్ కొన్ని సూచలు చేశారు. అయిదు ఈ- సమీకరణలు అంటే ఎడ్యుకేషన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఇంజినీరింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌, ఎమర్జెన్సీ.. వంటి విధానాలు పాటిస్తే ప్రమాదాలను నివారించొచ్చని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళాభవన్‌లో టీఎస్‌ ఆర్టీసీ ఆధ్వర్యంలో 31వ రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ డ్రైవర్లకు రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అవార్డులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె కాలంలో.. తాను ఏ ఒక్క రోజు కంటి నిండా నిద్రపోలేదన్నారు. ‘‘ఆ సమయంలో ఏ ఒక్క కార్మికుడు బలవన్మరణానికి పాల్పడొద్దు. తాత్కాలిక డ్రైవర్లతో నడుపుతున్న బస్సుల ద్వారా ఎలాంటి ప్రమాదం జరగొద్దు అని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ సంస్థలోని సమస్యలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొట్టిన పిండి అని, వాటికి సంబంధించిన పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉందన్నారు. వాహనదారులు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: