సినిమా అనేది ఇది ఒక నటన. అయితే అందులోని పాత్రలు, సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తాయి. మరికొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలైనా మరిచిపోలేని విధంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆ వరుసలో శంకరాభరణం సినిమా రిలీజ్ అయ్యి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా ఆ సినిమాను ఇప్పటికీ ఎవరూ అంత తేలిగ్గాయా మరిచిపోలేరు. శంకరాభరణం శంకరశాస్త్రి గారు పేరుపొందిన శంకరశాస్త్రి (జేవీ సోమయాజులు) ఈ సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. 


ఇక ఈ సినిమా షూటింగ్ కూడా తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సమీపంలోని రఘుదేవపురం అనే గ్రామంలో ఎక్కువ భాగం జరిగింది. ఈ గ్రామం సీతానగరం మండలంలో ఉంది. గోదావరికి అతి సమీపంలో ఉండే ఈ గ్రామం ప్రకృతి అందాలకు నెలవు గా ఉంటుంది. ఈ సినిమా అప్ప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుని ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది అంటే అప్పట్లో ఈ సినిమాకు ఏ విధమైన క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా ఘన విజయంతో అంతే స్థాయిలో ఈ గ్రామం పేరు కూడా అప్పట్లో మారుమోగింది. రఘుదేవపురం గ్రామాన్ని రైతాపురం అని కూడా పిలుస్తారు.

 

 ఈ సినిమా ద్వారా తమ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని ఇప్పటికీ ఆ గ్రామ ప్రజలు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ సినిమా షూటింగ్ తరువాత ఊర్లో అనేక చిత్రాలు కూడా షూటింగ్ జరుపుకున్నాయి. శంకరాభరణం సినిమా తెలుగు సినిమా రంగానికి మేలిమలుపుగా  ఇప్పటికీ నిలుస్తోంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా శాస్త్రీయ సంగీత అభిమానుల ప్రశంసలను పొందింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కె.విశ్వనాథ్ కు ఎక్కడ లేని పేరు రావడమే కాకుండా, కళాతపస్వి అనే బిరుదు కూడా ఆయన పొందారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గానంతో ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: