తెలుగు పరిశ్రమ కీర్తిని పెంచే కొత్త అధ్యాయాన్ని సృష్టించిన సినిమా శంకరాభరణం. 1980 ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన శంకరాభరణం సినిమా తెలుగు సినిమా అంటే కేవలం మాస్ మసాలా సినిమాలే కాదు... గౌరవప్రదమైన సినిమాలు అని అందరూ అనుకునేలా తెలుగు గౌరవాన్ని చాటిచెప్పిన సినిమా శంకరాభరణం. శాస్త్రీయ సంగీతం కి ఆదరణ కరువై కనుమరుగైపోతున్న వేళ ఈ  సినిమా విడుదలై... ప్రజలు మొత్తం శాస్త్రీయ సంగీతం వైపు చూసేలా చేసింది. దర్శకుడు కె.విశ్వనాధ్ ను  కళా తపస్విని చేసింది ఈ సినిమా... తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడే గాయకుడైన ఎస్పీ బాలసుబ్రమణ్యం కు జాతీయ అవార్డును వరించేలా  చేసింది. 

 

 

 ఈ సినిమా విడుదలై నేటికి 40 సంవత్సరాలు పూర్తయింది. సినిమాలో  శంకరశాస్త్రి తులసి మధ్య ఉన్న అనుబంధం ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో స్వర్ణకమలం అవార్డు అందుకున్న తొలి చిత్రంగా శంకరాభరణం నిలిచింది. సినిమాలు కథ కథాంశం ఎంత గొప్పగా ఉందో ఈ సినిమాకు సంగీతం కూడా అంతే గొప్పగా ఉంటుంది. సినిమాలో  కథానాయకుడైన శంకరశాస్త్రి ఓ వేశ్య కు ఆశ్రయం కల్పించాడు... శాస్త్రీయ సంగీతానికే ఆదరణ కరువై ఆర్థికంగా శంకరశాస్త్రి ఇబ్బందులు పడుతున్న సమయంలో తాను ఆశ్రయం కల్పించిన వేశ్య బిడ్డకు జన్మనిస్తుంది. చివరికి ఆ వేశ్య కొడుకే  శంకరశాస్త్రి సంగీత వారసుడు అవుతాడు. 

 

 

 శంకరాభరణం సినిమా కి కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వం జీవం లాంటిది అయితే... ఈ సినిమాకు v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసింది అనే చెప్పాలి. ఈ సినిమాకు జంధ్యాల సమకూర్చిన మాటలు మహా అద్భుతం అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో శంకర నాద శరీరా పాటతో సోమయాజులు నటనలో విశ్వరూపం చూపించారు. ప్రతి తెలుగోడు గౌరవంగా ఇది మా తెలుగు సినిమా అని చెప్పుకునే విధంగా శంకరాభరణం తెలుగు ఖ్యాతిని పెంచింది. ఇక ఈ సినిమాకు ఎన్నో అవార్డులు రివార్డులు సైతం సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: