తెలుగు చిత్ర పరిశ్రమలో మట్టిలో మాణిక్యం లాంటి  సినిమా శంకరాభరణం. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో... పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం నిర్మాణంలో... తెలుగు తెర మీదికి వచ్చిన సినిమా శంకరాభరణం. మాస్ మసాలాలు యాక్షన్ సీన్లతో తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం కొట్టుకుపోతున్న తరుణంలో.. తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని గుర్తు చేస్తూ... మానవ విలువలను తెలియచేస్తు... తెరకెక్కిన చిత్రం శంకరాభరణం.ఈ  సినిమాలో  సంగీత దర్శకులు v MAHADEVAN' target='_blank' title='కె వి మహదేవన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కె వి మహదేవన్ అందించిన సంగీతం.. ఎస్పీ బాలు పాడిన విధానం... తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది అనడంలో సందేహం లేదు. 

 

 

 ఇక ఈ సినిమాకు జంధ్యాల అందించిన మాటలు ప్రాణం గా నిలిచాయి అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమ విలువలను గుర్తుచేsi తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని పెంచిన శంకరాభరణం సినిమా 1980 ఫిబ్రవరి 2వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈనాటికీ ఈ సినిమా విడుదలై నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఇక శంకరాభరణం సినిమా ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకొచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కె.విశ్వనాథ్ కళాతపస్వి గా మారిపోయారు. ఇక ఈ సినిమాలో గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం కు జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు దక్కింది.ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేసిన కె.వి.మహదేవన్ కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు దక్కింది. 

 

 

 ఇక ఈ సినిమా ఆనాటి ట్రెండ్ సెట్టర్ గా  నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో  చంద్రమోహన్ రాజ్యలక్ష్మి పాత్రలు ఎంతో కీలకంగా మారతాయి. ప్రతి ఒక్కరిని ఈ రెండు పాత్రలు ఎంతగానో అలరిస్తాయి. ఇక చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య సాగే రొమాన్స్ తెలుతనం గుర్తు చేస్తూ సాగిపోతూ ఉంటుంది.. వీరి మధ్య సాగిన రొమాన్స్ లో ఎక్కడ కూడా అశ్లీలత లేకుండా... కొంచమైనా అసభ్యంగా కనిపించకుండా.. ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమాలో చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య చక్కటి రొమాన్స్ చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: