కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  ఎల్లాపటూరు ప్రాంతంలో సమత అనే వివాహిత పై ముగ్గురు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాలు అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణలోని హైదరాబాద్లో జరిగిన దిశ ఘటన కంటే మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎన్నో విచారణల  అనంతరం ఈ కేసులోని ముగ్గురు నిందితులు అయిన షేక్ బాబు షాబుద్దీన్ ముగ్దుమ్ లకు ... ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. 

 

 

 అయితే సమత అత్యాచారం జరిగిన 45 రోజుల్లోనే అదిలాబాద్ కోర్టు ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించడంపై.. రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారం చేసినవారికి ఇంత త్వరగా శిక్షలు పెడితే ఎవరు కూడా ఆడపిల్లలపై అత్యాచారాలు చేసేందుకు ముందుకు రారు అని తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. అయితే ఆదిలాబాద్ ప్రత్యేక క కోర్టు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సమత అత్యాచారంలోని  నిందితులకు అవకాశం కూడా  లేకపోలేదు. ఇక అందరూ అనుకుంటున్నట్లు గానే  సమత అత్యాచారం హత్య కేసులోని ముగ్గురు నిందితులు ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 

 

 

 ఇప్పటికే కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను... వారి కుటుంబ సభ్యులు చెల్లించారు. కాగా  తమ ఉరిశిక్షపై రేపు హైకోర్టులో ముగ్గురు నిందితులు అప్పీలు  చేయనున్నట్లు సమాచారం. 2019 నవంబర్ 24న కొమురం భీం జిల్లా లింగాపూర్  మండలం ఎల్లాపాటూరు శివారులో వివాహిత సమత అత్యాచారం హత్య జరిగింది. గ్రామంలో తిరుగుతూ బెలూన్లు  అమ్ముకుని జీవనం సాగించే సమత అనే మహిళపై... ముగ్గురు మృగాళ్లు అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం కిరాతకంగా గొంతు కోసి చంపేశారూ. ఇక ఇప్పుడు ముగ్గురు నిందితులు ఉరి శిక్ష పడినప్పటికీ హై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలియడంతో వారిని ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: