రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలందరూ... జగన్మోహన్ రెడ్డి 3 రాజధానిల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. రాజధాని అమరావతి అభివృద్ధి చేయాలంటూ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎన్నో ఆందోళనలు  నిరసనలు కూడా తెలుపుతున్నారు. ఇక అమరావతిలో అయితే పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలోని రైతులందరూ తీవ్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. అమరావతి లోనే కాకుండా పలు జిల్లాల్లో కూడా టిడిపి నేతలు కార్యకర్తలు జగన్ 3 రాజధానుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ  నందిగం  సురేష్... నందిగామలో ఓ వైద్యున్ని  ని కలిసేందుకు వెళ్లారు. నందిగం సురేష్ అక్కడికి వస్తున్నారు సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు అందరూ... నందిగం  సురేష్ ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే దళిత ఎంపీ వైఎస్ఆర్ సీపీ నాయకుడు నందిగం సురేష్ పై టిడిపి కార్యకర్తలు దాడికి యత్నించారు. జై అమరావతి అనాలి అంటూ ఎంపీ నందిగం సురేష్ పై టిడిపి నేతలు  డిమాండ్ చేశారు. ముఖ్యంగా టిడిపి నేత  సజ్జ అజయ్ చౌదరి మరికొందరు కార్యకర్తలు జై అమరావతి అనాలి అంటూ ఎంపీ నందిగం సురేష్ పై తీవ్ర ఒత్తిడి చేశారు. ఏకంగా టిడిపి నేత సజ్జ అజయ్ చౌదరి ఎంపీ నందిగామ సురేష్ పై దాడికి యత్నించాడు.

 

 

 అమరావతి అనాలి అంటూ నందిగం సురేష్ కారును టిడిపి నేతలు కార్యకర్తలు చుట్టుముట్టారు. అయితే టిడిపి కార్యకర్తలు జై అమరావతి అనాలని ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఏపీ నందిగం సురేష్ మాత్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి మా పార్టీ లక్ష్యం అంటూ స్పష్టం చేశారు. దీంతో వాహనాన్ని  చుట్టుముట్టిన టిడిపి నేతలు కార్యకర్తలు వాహనాన్ని ధ్వంసం చేసేందుకు యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చి నందిగం సురేష్ వాహనాన్ని పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: