పెంపుడు జంతువులను పెంచడం ఇప్పుడొక ఫ్యాషన్గా మారి పోయింది. అయితే ఫ్యాషన్ కోసం పెంపుడు జంతువులను పెంచుకొనే వారికంటే ప్రేమతో ఇష్టంతో పెంపుడు జంతువులను పెంచుకొనే వారే ఎక్కువ ఉంటారు ఈ రోజుల్లో. మనుషుల పైన ప్రేమ చూపిస్తారో  లేదో తెలియదు కానీ పెంపుడు జంతువులపై మాత్రం ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటారు. జంతువులకు కావాల్సిన పౌష్టికాహారాన్ని పెడుతూ ఎంతో జాగ్రత్తగా ఎంతో ముద్దుగా చూసుకుంటూ ఉంటారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువులను ఎవరైనా చంపాలి అనుకుంటారా..  కానీ ఇక్కడ చైనాలో మాత్రం అదే జరుగుతోంది. చైనాలోని చాలామంది ప్రజలు తమ ప్రాణం మీదికి వస్తుంది అని తెలిసేసరికి పెంపుడు జంతువుల ప్రాణాలు లెక్కలేకుండా లెక్క లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రాణాపాయాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ వైరస్ మనుషుల నుండి మనుషులకు కాకుండా జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు జంతువులను దారుణంగా చంపేస్తున్నారు చైనీయులు. పెంపుడు జంతువులను బహుళ అంతస్తుల భవనాల నుంచి విసిరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెంపుడు జంతువుల ప్రాణాలపై కనీస కనికరం కూడా చూపించడం లేదు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయారు. పెంపుడు జంతువుల్లో ప్రాణాంతకమైన 2019 ఎన్సిఓవి వైరస్ కలిగి ఉన్నాయని పుకార్లు నేపథ్యంలో ప్రస్తుతం పెంపుడు జంతువుల యజమానిలు   తాము ఉంటున్న బహుళ అంతస్తుల నుంచి వీధుల్లోకి పడేస్తున్నారు.

 

 

 రోడ్లపై ఎక్కడ చూసినా పెంపుడు జంతువుల శవాలే  కనిపిస్తున్నాయి. అయితే వ్యాధి సోకిన వారి దగ్గరికి వెళ్లి వచ్చిన జంతువులు క్యారెంటైన్ లో  ఉంచాలని మాత్రమే వైద్యులు సూచించారు... కాని దీనికి సంబంధించి సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేయడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దీంతో అతి దారుణంగా దయ లేకుండా పెంపుడు జంతువులను చంపేస్తున్నారు చైనాలోని చాలామంది. ఇక ఈ విషయాన్ని గ్రహించిన అధికారులు పెంపుడు జంతువులను చంపేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: