సాధారణంగా రాజకీయ నేతలు..తమ ప్రత్యర్ధ పార్టీలపై ఫైర్ అవ్వడమో, విమర్శలు చేయడమో చేస్తారు. అలాగే సొంత పార్టీని వెనుకేసుకుని వస్తూ రాజకీయం చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు కొందరు నేతలు సొంతపార్టీనే ఇబ్బంది పెడుతూ..కంటిలో నలుసు మాదిరిగా చుక్కలు చూపిస్తారు. ఈ విధంగా ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణంరాజులు అపోజిట్ వర్గంగా తయారయ్యారు.

 

మొదట రాపాక గురించి మాట్లాడుకుంటే....2019 ఎన్నికల్లో జనసేన తరుపున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే. ఆఖరికి పవన్ పోటీ చేసిన చోట్ల ఓడిపోయిన, రాపాక మాత్రం రాజోలు నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచారు. అయితే గెలిచిన దగ్గర నుంచి జనసేన ఎమ్మెల్యేగా అసలు నడుచుకోలేదు. ఏదో అధికార వైసీపీ ఎమ్మెల్యే మాదిరిగా ప్రవర్తిస్తూ వెళుతున్నారు. అసలు పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న, ఎలాంటి పోరాటం చేసిన రాపాక సమర్ధించలేదు. ఆయన దారిలో ఆయన నడుచుకుంటూ వెళ్లారు. పైగా సమయానికి తగ్గట్టుగా జగన్‌ని పొగుడుతూ...అధికార పార్టీకి అనుబంధ సభ్యుడుగా అయిపోయారు.

 

జగన్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని పొగిడారు. చివరికి ఆయన ఏ నిర్ణయం తీసుకున్న సమర్ధించారు. తాజాగా కూడా పవన్ మూడు రాజధానులకు వ్యతిరేకం అని చెప్పిన రాపాక మాత్రం జై కొట్టారు. ఇక ఇలాంటి పరిస్తితి వల్ల రాపాకని సస్పెండ్ చేయాలని పార్టీలో డిమాండ్ మరింత పెరుగుతూ వచ్చింది. కానీ పవన్‌కు ఏది సాధ్యం కాలేదు. ఆయన్ని సస్పెండ్ చేయలేదు. అలా అని దారిలో పెట్టుకోలేకపోయారు. ఆఖరికి రాపాక ఏ పార్టీలో ఉన్నాడో అర్ధం కావడం లేదంటూ జనసేనాని చేతులెత్తేశారు.

 

ఇక పవన్‌ని రాపాక ఇబ్బంది పెడుతుంటే...జగన్‌ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇబ్బంది పెడుతున్నారు. ఈయన కూడా వైసీపీ లైన్‌లో ఎప్పుడు నడవలేదు. ఆయనకు నచ్చిన విధంగా ముందుకెళుతున్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతో ఎప్పుడు టచ్‌లో ఉంటున్నారు. పైగా వైసీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి మాట అసలు లెక్క చేయడం లేదు. తాజాగా కూడా వెస్ట్ గోదావరిలో డి‌డి‌ఆర్‌సి సమావేశం జరిగితే తనకు స్టేజ్ పైన సీటు ఇవ్వలేదని అలిగి మధ్యలోనే వెళ్ళిపోయారు. అలాగే వైసీపీ నేతలందరూ బడ్జెట్ బాగోలేదని చెబితే, ఈయన మాత్రం బాగానే ఉందన్నట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికైతే రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీనో..లేక బీజేపీ ఎంపీనో అర్ధం కాకుండా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: