ఎన్నో ఆశలతో తొలిసారి 2019 ఎన్నికల్లో బరిలో దిగిన జనసేనకు దారుణ పరాజయం వచ్చిన విషయం తెలిసిందే. ఆఖరికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఇక ఎలాగోలా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలిచిన...ఆయన ఇప్పుడు అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జనసేనకు ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోయారు. సరేలే పోయింది ఏదో పోయింది. ఇక నుంచైనా మంచి పని చేసుకుంటూ వెళితే, వచ్చే ఎన్నికల్లో అయిన కాస్త సత్తా చాటోచ్చని జనసేన నేతలు పార్టీలో కష్టపడుతున్నారు.

 

ఇప్పటి నుంచి కష్టపడితే నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీ తరుపున టికెట్ దక్కించుకుని అదృష్టం పరీక్షించుకోవచ్చని అనుకుంటున్నారు. సరిగా ఇలాంటి సమయంలోనే జనసేన నేతలకు బీజేపీ రూపంలో పెద్ద షాక్ తగిలింది. పవన్ ఊహించని విధంగా బీజేపీ కలిసి పయనించాలని నిర్ణయించుకున్నారు. ఏం చేసిన ఆ పార్టీతోనే కలిసి చేయాలని అనుకున్నారు. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కావొచ్చు, 2024 ఎన్నికలు కావొచ్చు బీజేపీతో పొత్తులో పోటీ చేయొచ్చని ఫిక్స్ అయ్యారు. ఇలా పొత్తు పెట్టుకోవడమే ఎమ్మెల్యే టికెట్ల మీద ఆశలు పెట్టుకున్న ఆశావాహుల్లో అసంతృప్తి మొదలైంది. ఒక్కసారి బీజేపీ పొత్తు తెరపైకి రావడంతో జనసేనలో అంతర్గత సమస్యలు మొదలయ్యాయి.

 

 

ఇప్పటి నుంచి నియోజకవర్గాల్లో కష్టపడి పని చేసిన వచ్చే ఎన్నికల్లో టికెట్ దొరకడం కష్టమని నేతలు సైడ్ అయిపోతున్నారు. పొత్తులో ఉంటాం కాబట్టి, ఇప్పుడు నుంచి మనం పొడిచేది ఉండదని అనుకుంటున్నారు. రాబోయే పొత్తులో తమ సీటు ఉంటుందో ఉండదో గ్యారంటీ లేనప్పుడు ఇప్పటినుంచి పార్టీ కోసం శ్రమించడం వృధా అనే కొందరు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు మాత్రం తమ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఎవరు ఉన్నా, పోయినా నష్టం లేదని లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ పరిస్తితి చూస్తుంటే ఇప్పటి నుంచే జనసేన నేతలు పవన్‌కు దండం పెట్టేస్తున్నారు.

       

మరింత సమాచారం తెలుసుకోండి: