పెన్షన్ లపై ప్రతిపక్షాలతో పాటు పచ్చ మీడియా కు చెందిన కొంతమంది మీడియా అధిపతులు ఇష్టానుసారంగా ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తూ, అనవసర గందరగోళం సృష్టిస్తున్నారు అంటూ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉండగా 39 లక్షల మందికి పెన్షన్లు వచ్చేవని, కానీ జగన్ అధికారం చేపట్టిన ఈ కొద్ది నెలల సమయంలోనే సుమారు 55 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని నాని చెప్పారు. 


పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించే విధంగా జగన్ శ్రీకారం చుట్టారని, ఈ విధానంతో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తూ జగన్ పై ప్రశంసలు కురిపిస్తుండడాన్ని తట్టుకోలేక ప్రతిపక్షాలు, పచ్చ మీడియా పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు తగ్గించారనే ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని నాని అన్నారు. సంక్షేమ పథకాలతో ఏపీ లో కోటి మందికి పైగా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు అంటూ నాని వెల్లడించారు.

 

అయితే జగన్ ప్రభుత్వానికి మైలేజ్ రాకుండా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ను అర్జెంటుగా సీఎం కుర్చీ నుంచి దించేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చంద్రబాబు, ఆయన భజన మీడియా కోరుకుంటోందని నాని విమర్శలు చేశారు. చైనాలో కరోనా వైరస్, ఏపీలో యెల్లో వైరస్ ఉన్నయాయని అయితే కరోనా కంటే ఎల్లో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ నాని వ్యాఖ్యానించారు. 


పెన్షన్ లపై గగ్గోలు పెడుతున్న చంద్రబాబు రామోజీరావు, రాధాకృష్ణ లకు పెన్షన్లు రాకపోతే రాష్ట్రంలో మరెవరికీ పెన్షన్లు రానట్లేనా అంటూ నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ ను ఎన్ని రకాలుగా అప్రతిష్టపాలు చేయాలని చూసినా ఆయన వెంట జనం ఉన్నారంటూ ఆయన్ను వెళ్లేవారూ ఏమీ చేయలేరు అని నాని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: