టిక్ టాక్ వీడియోలు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి. చిన్న,పెద్ద తేడా లేకుండా అందరూ దానికి ఎడిక్ట్ అవుతున్నారు. స్కూల్ విద్యార్థుల నుంచి ముదుసలి వరకు టిక్ టాక్ చేస్తూ షేర్ లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ టిక్ టాక్ వైరస్ ఉద్యోగులకు అంటుకుంది. విధులను మరిచి కార్యాలయాల్లోనే దర్జాగా టిక్ టాక్ చేస్తూ అబాసుపాలవుతున్నారు. ఇలా గతంలో ఎందరో టిక్ టాక్ చేసి ఉద్యోగాలను సైతం కోల్పోయారు.  

 

తాజాగా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కార్యాలయంలో టిక్‌టాక్‌ చేసి వివాదస్పదంగా మారాడు ఓ ఉద్యోగి.   కరీంనగర్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సీసీ రాకేశ్‌ టిక్‌టాక్‌ లాంటి లైక్‌ వీడియోలు చేస్తూ కార్యాలయంలో రిలాక్స్‌ అవుతున్న వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అధికారులందరూ నిత్యం తమ విధుల్లో బిజీగా ఉంటారు. కానీ సీసీ రాకేశ్‌ మాత్రం లైక్‌ వీడియోలు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

గతంలో ఖమ్మం కార్పొరేషన్ లో కూడా మహిళా అధికారులతో కలిసి మగ అధికారులు టిక్ టాక్ చేసి విమర్శలసపాలయ్యారు. వాటిని మరిచిన రాకేశ్.. ఉన్నతాధికారులు, కార్పొరేషన్‌ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ క్షణం తీరిక లేకుండా ఉండాల్సిన ఆయన ఏకంగా కార్యాలయంలోనే లైక్‌లో రొమాంటిక్‌ వీడియోలు, డైలాగులు చెబుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై నగర  ప్రజలు, కార్పొరేటర్ల నుంచి వ్యతిరేఖత వస్తోంది.

 

 నిత్యం రద్దీగా ఉంటే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు. ప్రజాప్రతినిధులు వస్తుంటారు. వారికి సమాచారం ఇస్తూ ఉండాల్సిన కమిషనర్‌ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రాకేశ్‌ కార్యాలయంలోని తన సీట్లో కూర్చొని సుమారు 8 వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారి విధుల్లో అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంట్లో కూర్చోని తాఫీగా టిక్ టాక్ లు చేసుకుంటాడని, వెంటనే ఆయన ఆ అవకాశం ఇవ్వాలని ప్రజలు ఎద్దెవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: