దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చుసిన 2020 బడ్జెట్ నిన్న ఉదయం 11 గంటలకు నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. అయితే అలాంటి ఈ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు చాలా అన్యాయం జరిగింది. గత 5 ఏళ్ళ నుండి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎం తెచ్చుకోలేదు.. ఇప్పుడు యువ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి తట్టుకోలేక.. అతని పాలనలో ఈ చిన్న తప్పు కనిపించిన... వర్దంతికి జయంతికి తేడా తెలియని వారు కూడా ఆయనను అనే వారే.. 

 

గత సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమాత్రం నిధులు తెచ్చాడు? ఏమైనా అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. అతను ఏ మాత్రం రాష్ట్రం కోసం చేశాడు ? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్లో ఏపీకి మొండిచేయి చూపినదె.. అప్పుడు ఉన్న టీడీపీ ఎంపీలు అంత పార్లమెంట్ లో ఎం చేశారు.

 

వైసీపీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చింది. మొట్టమొదటిసారి యువనాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నింటిలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ లో తెచ్చుకోలేదు అంటే ఇది వైఫల్యం అనే చెప్పాలి. కానీ సీఎం జగన్ చాల రకాలుగా కష్టపడ్డాడు.. పార్లమెంట్ లో ఉన్న 22 మంది ఎంపీలు ఏదో ఒక విధంగా తెస్తారు అని ఆశించారు. కానీ అవ్వలేదు. ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కాదు దక్షణాది రాష్ట్రాలు అన్నింటికీ అదే సమస్య. 

 

దక్షణాది అంటే చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను దూషిస్తున్నాయి ప్రతిపక్షాలు. 22 మంది ఎంపీలు, విజ‌య‌సాయిరెడ్డి లాంటి వాళ్లు ఉన్నా అక్క‌డ నోరు మెద‌ప‌లేదు అని.. స్పందించ‌లేదు అని విపక్షాలు ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియా వేధికగా రాష్ట్రానికి నష్టం వచ్చింది అని అనేకంటే సీఎం జగన్ ఇది చెయ్యలేకపోయాడు అనే ఎగురుతున్నాయి. మరి ఈ ప్రతిపక్ష మాటలకూ.. విమర్శలకు సీఎం జగన్ ఏం చెయ్యనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: