చెవిరెడ్డి భాస్కరరెడ్డి...చంద్రబాబు పుట్టిన వూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే. ఎన్నో ఏళ్లుగా చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే చెక్ పెడుతున్న నేత. గత 2014 ఎన్నికల్లో చెవిరెడ్డిని ఓడించడానికి బాబు చాలానే ప్రయత్నాలు చేశారు గానీ..అవేమీ వర్కౌట్ కాలేదు. చెవిరెడ్డి చంద్రగిరిలో వైసీపీ జెండా ఎగరవేశారు. అయితే చెవిరెడ్డి గెలిచిన...అధికారం మాత్రం బాబుకే వచ్చింది. దీంతో బాబు, లోకేష్‌లు చెవిరెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారు.

 

పైగా చెవిరెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటూనే...బాబు అండ్ బ్యాచ్‌ని తెగ ఆడుకున్నారు. ఇక ఈ పగ అంతా పెట్టుకుని బాబు...చెవిరెడ్డిని అన్నీ విధాల ఇబ్బందులు పెట్టారు. ఒకానొక సమయంలో చెవిరెడ్డిని అనవసరపు కేసులో జైలులో కూడా పెట్టించారు. అన్నీ తట్టుకుని చెవిరెడ్డి నిలబడ్డారు. తిరిగి 2019 ఎన్నికల్లో బాబు కుతంత్రాలు చేసిన గెలిచారు. ఇక ఇటు చెవిరెడ్డి గెలవడమే కాకుండా వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది.

 

దీంతో బాబుని ఇటు అసెంబ్లీలోనూ...అటు నియోజకవర్గంలోనూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. తాజాగా కూడా మూడు రాజధానుల విషయంలో బాబు సొంత వూరులోనే సభ పెట్టించారు.  మూడు రాజధానులకు మద్దతుగా భాస్కర్ రెడ్డి ఆదివారం నాడు నారావారిపల్లెలో భారీ సభకు ప్లాన్ చేసి, ఆ సభకు ఆరుగురు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి దుమ్ములేపారు. ఇక బాబు సొంత వూరిలోనే సభ పెట్టడంతో టీడీపీ శ్రేణులకు ఉడుకులు వచ్చేసి...ఆ సభని అడ్డుకోవడానికి ప్లాన్ చేసి, నిరసనలు తెలియజేయడానికి ప్లాన్ చేశారు. కానీ వారి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యి, చెవిరెడ్డి సభకు భారీగా జన సందోహం హాజరైంది.

 

అయితే బాబు ఇంటి దగ్గరలోనే సభ ప్లాన్ చేసి...చెవిరెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. పైగా బాబు అమరావతి అంటుంటే...చెవిరెడ్డి మూడు రాజధానులే ముద్దు అంటూ...నారావారిపల్లెలోనే సభ పెట్టి రాష్ట్రానికి కూడా బాబు వూరిలో కూడా మూడు రాజధానులు కావాలని అడుగుతున్నారని చాటి చెప్పి ఆడు మగడ్రా బుజ్జి అనిపించుకునేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: