ఒక హృదయపూర్వక ఘటన లో,  మనిషి ని, మనిషి కాపాడటానికి వంద సార్లు ఆలోచించే ప్రస్పుత పరిస్థితులలో,  40 ఏళ్ల మంగుళూరు మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి, ఒక  కుక్కను రక్షించడానికి 30 అడుగుల లోతైన బావి లోకి  దిగి దానిని కాపాడింది. జంతు రక్షకురాలు అయినా  రజనీ దామోదర్ శెట్టి ఈ గొప్ప పనిని చేసింది. ఆమె  మంగళూరులోని దోద్దాహిట్లూలో నివసిస్తున్న ఒక  గృహిణి.

 

 

 

 

 

 

 

 

నగరంలోని బల్లాల్‌బాగ్ వద్ద ఒక బృందం గంటల తరబడి ప్రయత్నించి, బావిలో పడిపోయిన కుక్కను రక్షించడంలో విఫలమైనప్పుడు, రజనీని అక్కడికి పిలిచారు. ఓ కుక్క ఆకస్మాత్తుగా బావిలో పడింది. దాని కేకలు విన్న స్థానికులు అయ్యో పాపం అంటున్నారే తప్పితే దాన్ని ఎలా రక్షించాలో తెలియక చూస్తూ ఉండిపోయారు.  స్థానిక నివేదికల ప్రకారం, ఇతర వీధి కుక్కలతో గొడవ పడిన తరువాత కుక్క బావిలో పడిపోయి, రాత్రంతా బావిలో గడిపింది. నాకు కాల్ వచ్చిన మరు  క్షణమే , నేను సంఘటన స్థలానికి  చేరుకున్నాను. కుక్క  భయ పడుతూ వుంది. నేను కొంచెం భయపడ్డాను, కానీ అదే సమయంలో, కుక్క ను  కాపాడానికి నా శయ శక్తుల ప్రయత్నిస్తాను అని   నేను అనుకున్నాను.  నేను నమ్మకంగా ఉంటేనే నేను బావిలోకి దిగాలని, నా ప్రాణాలను పణంగా పెట్టకూడదని స్థానికులు నాకు చెప్పారు, అని ఆమె అన్నారు. ఇంకా, ఇది కనీసం 10 అడుగుల నీటితో నిండి వున్నా  ఉపయోగించని బావి అని రజనీ వివరించారు. నేను నా చుట్టూ  ఒక తాడు కట్టి, బావిలోకి దిగి  కుక్కను రక్షించాను అని ఈత తెలియని రజని చెప్పింది. 

 

 

 

 

రజనీ దాదాపు ఒక దశాబ్ద కాలంగా  వీధి  కుక్కలకు ఆహారం ఇస్తున్నారు. ఆమె తన ఇంటిలో 14 కి పైగా వీధి  కుక్కలను పోషిస్తున్నారు. ప్రతి రోజు అర్థ  రాత్రి 12  గంటలు  మరియు 2  గంటల  మధ్య, మేము నగరంలోని దాదాపు 150 కుక్కల కు  ఆహారాన్ని అందిస్తాము. మిగిలిపోయిన చికెన్‌తో కలిపి సుమారు 8 కిలోల బియ్యం ఉడకబెట్టి కుక్కలకు ఆహారంగా ఇస్తాము. గాయపడిన పక్షులు, జంతువులు మరియు పాములను నా ఇంట్లో రక్షించి చికిత్స చేసి , నేను వాటిని  అడవిలోకి విడుదల చేస్తాను అని  ఆమె చెప్పారు.  రజనీ డాగ్ రెస్క్యూ మిషన్ వీడియో వైరల్ అయినప్పటి నుండి, అందరు ఆమెను అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: