ఈ-కామర్స్‌ అమ్మకందారులపై ప్రభుత్వం భారం మోపనుంది. ఈ-కామర్స్‌ వేదికగా జరిగే లావాదేవీలపై 1% టీడీఎస్‌ (టాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌)ను లెవీగా విధించాలని శనివారం నాటి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ-కామర్స్‌ అమ్మకం దారులను పన్నుల పరిధిలోకి తీసుకు వచ్చేందుకు సంబంధిత చట్టంలో కొత్తగా సెక్షన్‌ 194-ఓ చేర్చాలని ప్రతిపాదించింది. వీటితో పాటు సెక్షన్‌ 197 (తక్కువ టీడీఎస్‌ కోసం), సెక్షన్‌ 204 (ఏదైనా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యతగల వ్యక్తిని నిర్వచించడానికి), సెక్షన్‌ 206ఎఎ (నాన్‌ పాన్‌/ఆధార్‌ కేసుల్లో 5 శాతం పన్ను మినహాయింపు అందించడానికి)కు సవరణలు తీసుకు రానున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి సవరణ అమలులోకి రానున్నది. 

 

దీని ప్రకారం డిజిటల్‌ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటర్... విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1% టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. ఈ సవరణ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ -కామర్స్ ఆపరేటర్ లేదా డిజిటల్ ప్లాట్ ఫాంను నిర్వహించే వాళ్లు లేదా ఓనర్లు మొత్తం స్థూల విక్రయాలు లేదా సేవలు లేదా రెండింటి పైన ఒక శాతం టీడీఎస్‌ను విధించవలసి ఉంటుంది. 

 

అయితే, ఎవరైనా విక్రేత ఈ-కామర్స్ సైట్ ద్వారా జరిపిన స్థూల విక్రయాల మొత్తం రూ.5 లక్షలలోపు ఉండి ఆధార్ లేదా పాన్‌ను ఇచ్చి ఉంటే ఈ నిబంధన వర్తించదు. దీనిని అధ్యయనం చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. ఈ-కామర్స్‌ అమ్మకందారులపై ప్రభుత్వం భారం మోపనుంది. ఈ-కామర్స్‌ వేదికగా జరిగే లావాదేవీలపై 1% టిడిఎస్‌ (టాక్స్‌ డిడక్టెడ్‌ ఎట్‌ సోర్స్‌)ను లెవీగా విధించాలని శనివారం నాటి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించింది. 

 

ఇలా పలు రకాలుగా పలు విషయాలలో సవరణలు తీసుకురానున్నది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుండి సవరణ అమలులోకి రానున్నది. ఈ-కామర్స్‌ నిర్వాహకుడు జరిపిన మొత్తం అమ్మకాలు, సేవలు లేదా రెండింటిపైన ఒక శాతం టిడిఎస్‌ను తీసివేయాలని బడ్జెట్‌ పత్రంలో పేర్కొన్నారు. ఈ కామర్స్ వ్యవస్థాపకులు సంగతి ఎలా వున్నా, వినియోగదారులకు ఇది కొంచెం గడ్డు కాలమనే అర్ధంచేసుకూవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: