అవును వారం వారం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ రాస్తున్న కొ(చె)త్తపలుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి మీద పేరుకుపోయిన  విషాన్ని  ఎలా వెళ్ళగక్కాలో అర్ధంకాక ప్రతి ఆదివారం జనాల మీదకు  చిమ్ముతుంటారు. ప్రతి ఆదివారం చిమ్మినట్లుగానే ఈ ఆదివారం కూడా జగన్ అంటే తనలో పేరుకుపోయిన ధ్వేషాన్ని వేమూరివారు ఎటువంటి మొహమాటం లేకుండా బయటకు కక్కేశారు.

 

ఈసారి రాసిన చెత్తపలుకులో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించుకోవచ్చు. మొదటిది జగన్ ను ఎన్నికల్లో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా జగన్ పాలన చూసి ఇపుడు తెగ బాధపడిపోతున్నాడట. జగన్ పాలన ఇలాగుంటుందని ముందే ఊహించుంటే అసలు పని చేసే వాడినే కాదని వేమూరి కలలోకి వచ్చి చెప్పినట్లున్నారు. ఎందుకంటే, ప్రశాంత్ కిషోర్ కేవలం ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. ఆయన ఏ పార్టీని గెలిపించలేడు, ఓడగొట్టలేడు. జగన్ను ఆయనే గెలిపించాడని అనుకుంటే మరి ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బిఎస్పీ, కాంగ్రెస్ మిత్రపక్షాలను ఎందుకు గెలిపించలేదు ?

 

ఇక దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదికల్లో ’ఏపిని ఎందుకు దెబ్బతీసుకుంటున్నారు’ ?  ఈ ప్రశ్న ఎవరిని ఎవరడిగారో వేమూరి రాయలేదు. నాలుగు గోడల మధ్య కూర్చుని చేసే వంటల్లో ఎక్కడ కూడా ఎవరి పేర్లుండవన్న విషయం అందరికీ తెలిసిందే.  ప్రపంచ ఆర్ధిక సదస్సులో  పాల్గొనే వాళ్ళల్లో చాలామందికి అసలు భారతదేశంతోన సంబంధాలుండవు. అలాంటిది దేశాన్ని దాటి ఏపి గురించి అందులోను అమరావతి , జగన్ పరిపాలన గురించి తెలిసే అవకాశమే లేదు.

 

విశాఖపట్నం ప్రాంతంలో జగన్ సమీకరిస్తున్న 6 వేల ఎకరాల్లాగే చంద్రబాబు అమరావతిలో సమీకరించాడని రాశాడు. చంద్రబాబు రైతుల నుండి సమీకరించిన భూమితో బడా బాబులతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కానీ జగన్  పేదలకు ఇళ్ళు కట్టించేందుకు సేకరిస్తున్నాడు. అసలు రెండింటికి పోలికే లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ కొడుతున్న దెబ్బలకు చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయిపోతోంది. దాని ప్రభావం పాపం వేమూరి మీద కూడా పడినట్లుంది. అందుకనే ఇలాంటి చెత్తపలుకులు రాస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: