శనివారం రోజు లోకసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతూ... ఆరోగ్య రంగం మెరుగుపరచడానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. దానిలో ముఖ్యంగా వైద్యుల సంఖ్య ప్రతి ప్రాంతంలో పెంచేందుకు... ఆస్పత్రి ఉన్న ప్రతి జిల్లాలో దానికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో కేవలం 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ప్రతి జిల్లాలో ఉన్న ఒక హాస్పిటల్ కి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజీ కట్టిస్తే... మొత్తం 13 కాలేజీలు మాత్రమే వస్తాయి. కానీ ఒకవేళ జిల్లాల సంఖ్యను పెంచితే మెడికల్ కాలేజీల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు వైద్య వృత్తిని ఎంచుకునే విద్యార్థులకు తమ రాష్ట్రంలోనే చదువుకోవడానికి సరిపడా సీట్లు లభిస్తాయి.


ఎంత లేదనుకున్నా ఏడాదికి కనీసం 50 సీట్లు అయినా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో తక్కువ ధరకు భూములను కాలేజీల నిర్మాణాలకి అందించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు భావిస్తోంది. సో, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 25 కంటే ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నారు. తెలంగాణలో కేవలం పది జిల్లాలు ఉన్నప్పటికీ.. కెసిఆర్ ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను చేసింది. దీన్నిబట్టి.. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలని తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య కంటే ఎక్కువగా చేయడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.


ఇకపోతే ఎంతోకాలంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నదే. దాంతో ఇప్పుడు ఎక్కువ జిల్లాలను ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్ పేరుతో ఒక సరి కొత్త జిల్లాని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈ హామీని కూడా నెరవేర్చుకున్నట్టు అవుతుంది. జిల్లాల ఏర్పాటు ఎప్పుడో అయిపోయేది కానీ ఇటీవల ప్రకటించిన మూడు రాజధానుల విషయం రాష్ట్రంలో కాస్త గందరగోళం సృష్టించింది కాబట్టి జిల్లాల ఏర్పాటును వాయిదా వేసుకుంటూ వస్తున్నారు వైసీపీ సర్కార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: