కొన్ని ఆస్పత్రులలో వైద్యులు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతున్నారు. చనిపోయిన వారికి కూడా చికిత్స అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలో చూపించిన విధంగానే నిజ జీవితంలో కొందరు వైద్యులు డబ్బు కోసం చనిపోయిన పాపకు చికిత్స అందించిన ఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఒక కార్పొరేట్ పిల్లల ఆస్పత్రి కాసుల కోసం కకృత్తి పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరమేష్, పావని దంపతులు 25 రోజుల వయస్సు ఉన్న తమ పాపను ఎల్బీ నగర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తమ పాప ఉమ్మనీరు తాగిందని అప్పటినుండి పాపకు ఆరోగ్య సమస్య ఏర్పడిందని తల్లిదండ్రులు వైద్యులకు తెలిపారు. వైద్యులు చిన్నారికి పలు పరీక్షలు జరిపారు. 
 
పరీక్షల అనంతరం వైద్యులు చిన్నారి ప్రాణాలకు ఎటువంటి అపాయం లేదని కానీ రోజుకు 30,000 రూపాయల వరకు ఖర్చవుతుందని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. తమ పాప బ్రతికితే చాలని ఎంత ఖర్చైనా పరవాలేదని రోజుకు 30,000 రూపాయల చొప్పున నాలుగు రోజులకు 1,20,000 రూపాయలు దంపతులు చెల్లించారు. వైద్యులు పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని కానీ మరికొంత డబ్బు చెల్లించాలని కోరారు. 
 
చిన్నారి తల్లిదండ్రులు సరేనని పాప దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే పాప చనిపోయి ఉంది. తమ పాప బ్రతికే ఉందనే ఆశతో ఆస్పత్రికి వెళ్లిన పాప తల్లిదండ్రులు పాప చనిపోవడంతో షాక్ కు గురయ్యారు. ఆస్పత్రి దగ్గర పాప తల్లిదండ్రులు వైద్యులు తమను మోసం చేశారని ఆందోళనకు దిగారు. చికిత్స పేరు చెప్పి చనిపోయిన పాపకు వైద్యం చేశారని తమను దారుణంగా మోసం చేశారని పాప తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. విషయం తెలిసిన దంపతుల బంధువులు కూడా ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: