మెలొడీస్ ఎప్పటికీ పాతబడవు. కొత్తకొత్త జానర్స్ ఎన్ని వచ్చినా.. మెలొడీస్ కి ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఒక్కోసారి ఆ పాటలు అంతగా మెప్పించకపోవచ్చు గానీ.. ఆ ట్యూన్స్ మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మణిశర్మ కూడా ఇలాగే మధ్యలో కొంచెం స్లో అయినట్టు కనిపించినా.. ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. 

 

పూరీ జగన్నాథ్ కెరీర్ ను ట్రాక్ ఎక్కించి.. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఇస్మార్ట్ శంకర్. యూత్ ని ఓ ఊపు ఊపేసిన ఈ మూవీ హిట్ లో మేజర్ క్రెడిట్ మణిశర్మకే దక్కుతుందని చెప్పొచ్చు. మాస్ బీట్స్, రొమాంటిక్ ట్యూన్స్ తో ప్యాక్ అయిన ఇస్మార్ట్ ఆల్బమ్ కు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ కనెక్టివిటీతోనే సూపర్ కలెక్షన్లు వచ్చాయి. 

 

ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ సూపర్ హిట్ కావడంతో మణిశర్మకు స్టార్ హీరోలు మళ్లీ కాల్స్ చేస్తున్నారు. మణిశర్మతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా హంగామా చేస్తోన్న తమన్ కూడా కొంతకాలం బ్యాడ్ పీరియాడిక్ ఫేస్ చేశాడు. రొటీన్ ట్యూన్స్ ఇస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్స్ తో టాలీవుడ్ ని మాయ చేస్తున్నాడు. సో సంగీత దర్శకుల టైమ్ ఎప్పుడు మారుతుంది అనేది వాళ్ల ట్యూన్సే డిసైడ్ చేస్తాడని చెప్పొచ్చు.  

 

మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఇప్పటికీ తనలో టాలెంట్ తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు. అది ఇస్మార్ట్ శంకర్ తో నిరూపితమైంది. అందుకే ఆయనను అప్రోజ్ అవుతున్నారు కొందరు ప్రముఖులు. తమ సినిమాలకు మ్యూజిక్ ఇవ్వాల్సిందిగా ప్రతిపాదనలు పెడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి సైతం ఆ లిస్ట్ లో ఉండటం విశేషం. అదిరిపోయే మెలోడీస్ ఇటీవల వచ్చిన సినిమాలో ఇచ్చి.. తన టాలెంట్ ఏంటో మరోసారి రుజువు చేసుకున్న మణిశర్మ.. ఆ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: