రాజకీయాల్లో ఏ సీనియర్ నాయకుడైన... తమ సత్తా తగ్గిపోతే వారసులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఎన్నికల్లో టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ గెలుపు రాకపోతే, కుమారుడు భవిష్యత్ ఏ పార్టీలో ఉంటే బాగుంటుందో కూడా ఆలోచన చేస్తారు. కరెక్ట్‌గా ఇలాంటి ఆలోచనే ఓ టీడీపీ సీనియర్ నేత చేస్తున్నట్లు తెలిసింది. కాకపోతే ఇప్పటికీప్పటికి కాకపోయినా, రానున్న రోజుల్లో పరిస్థితులని బట్టి రాజకీయం నడిపే అవకాశముందని అంటున్నారు.

 

అలా కుమారుడు భవిష్యత్ కోసం ఆలోచన చేస్తున్న నేత..మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన బొజ్జల... 1989లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అదే ఊపులో 1994,1999 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అలాగే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కూడా పని చేశారు. 2004లో మళ్ళీ బొజ్జల శ్రీకాళహస్తి నుంచే పోటీ చేసి ఓడిపోయారు.  2009, 2014 ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించారు. 2014లో చంద్రబాబు కేబినెట్ లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

 

అయితే అనారోగ్య కారణాలు వల్ల బాబు...బొజ్జలని కేబినెట్ నుంచి తప్పించారు. ఇక మొన్న ఎన్నికల్లో కూడా బొజ్జల పోటీ నుంచి తప్పుకుని కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇప్పించారు. కానీ అనుహ్యాంగా సుధీర్ వైసీపీ అభ్యర్ధి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక ఓడిన దగ్గర నుంచి బొజ్జల గానీ, ఆయన కుమారుడు గానీ పార్టీలో యాక్టివ్‌గా లేరు. నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీ డామినేషన్ వచ్చేయడంతో బొజ్జల ఫ్యామిలీ సైలెంట్ అయిపోయింది.

 

ఈ క్రమంలోనే రాయలసీమలో టీడీపీ మరింత వీక్ కావడంతో...బొజ్జల ఫ్యామిలీ ఆలోచనలో పడిందని తెలుస్తోంది. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదు కాబట్టి, ఆ పార్టీని వీడటం బెటర్ అనే ఆలోచనలో ఉన్నారని, కాకపోతే ఇప్పటికిప్పుడు కాకపోయిన, భవిష్యత్‌లో పరిస్థితులని బట్టి టీడీపీకి బై చెప్పే అవకాశముందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: