చిత్తూరు జిల్లా...చంద్రగిరి నియోజకవర్గం. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన వూరు నారావారిపల్లె ఇదే నియోజకవర్గంలో ఉంది. అయితే అవ్వడానికి బాబు పుట్టిన నియోజకవర్గమైన ఇక్కడ టీడీపీ జెండా ఎగరడం చాలా తక్కువ. అసలు బాబు ఈ నియోజకవర్గం నుంచే గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. చంద్రబాబు 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత చంద్రగిరిలో చంద్రబాబుకు తొలి ఓటమి కూడా ఎదురైంది.

 

1983 ఎన్నికల్లో బాబు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి...టీడీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. 1985 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్ధినే విజయం సాధించారు. అయితే అప్పటికి బాబు టీడీపీలోకి వెళ్ళడం, తర్వాత చంద్రగిరిలో ఓటమి తప్పదని భావించి 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసి గెలిచారు. ఇటు చంద్రగిరిలో 1989లో కాంగ్రెస్ నుంచి గల్లా అరుణ కుమారి గెలిచారు. ఇక 1994లో రామ్మూర్తి నాయుడు టీడీపీ నుంచి గెలిస్తే...1999, 2004, 2009 ఎన్నికల్లో గల్లా అరుణ కుమారినే కాంగ్రెస్ నుంచి గెలిచింది. 2014 ఎన్నికలోచ్చేసరికి వైసీపీ రావడంతో పరిస్తితులు మారిపోయాయి.

 

ఆ ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న బాబు, చంద్రగిరిలో సత్తా చాటలేకపోయారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో అయిన చెవిరెడ్డికి చెక్ పెట్టాలని బాబు ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. చెవిరెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచారు. దీంతో బాబు ఆశలకు మరోసారి బ్రేక్ పడ్డాయి. అయితే భవిష్యత్‌లో కూడా బాబుకు చంద్రగిరి దక్కడం కల్లే అని చెప్పొచ్చు.

 

ఎందుకంటే ఇది వైసీపీకి కంచుకోటగా మారిపోయింది. పైగా బాబు మూడు రాజధానులు వద్దనడం వల్ల సొంత జిల్లాలో కూడా వ్యతిరేకిత బాగా వచ్చింది. తాజాగా చెవిరెడ్డి ఆధ్వర్యంలో బాబు సొంత వూరు నారావారిపల్లెలో మూడు రాజధానుల మద్ధతుగా సభ పెట్టి సత్తా చాటారు. ఈ పరిస్తితులన్నీ బేరీజు వేసుకుంటే ఫీచర్‌లో బాబుకు చంద్రగిరి దక్కడం చాలా చాలా కష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: