విశాఖపట్నం...ప్రస్తుతానికి ఐటీ అడ్డా..త్వరలో ఏపీ పరిపాలన రాజధాని. సీఎం జగన్ తీసుకున్న అద్భుత నిర్ణయం మూడు రాజధానుల్లో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుంది. ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావడం వల్ల వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రలో మంచి అభివృద్ధి జరగనుంది. ఇదే సమయంలో అభివృద్ధే కాకుండా ఈ నిర్ణయం వల్ల ఏ పార్టీకి ఏ విధమైన పోలిటికల్ మైలేజ్ వస్తుందనే లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం నగరంలో వైసీపీ పుంజుకుందా, టీడీపీ పట్టు కోల్పోయిందా అనే చర్చలు ఎక్కువ జరుగుతున్నాయి.

 

అయితే ఇక్కడ వైసీపీ పుంజుకుందా..టీడీపీ పట్టు కోల్పోయిందా అనే మాటలు ఎందుకు వాడాల్సి వచ్చిందంటే...2019 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో వైసీపీ మెజారిటీ సీట్లు గెలుచుకున్నా...నగర పరిధిలో ఉన్న నాలుగు సీట్లలో మాత్రం చతికలపడింది. విశాఖ ఉత్తరం, దక్షిణం, తూర్పు, పశ్చిమ ఈ నాలుగు సీట్లని టీడీపీనే కైవసం చేసుకుంది. ఉత్తర నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గెలిస్తే, దక్షిణలో వాసుపల్లి గణేశ్, తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమలో గణబాబులు విజయం సాధించారు.

 

ఇక దీని బట్టి చూసుకుంటే నగరంలో టీడీపీకే మంచి పట్టు ఉందని అర్ధమైపోతుంది. కానీ ఒక్కసారిగా జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానుల విషయంతో విశాఖలో పరిస్తితులు మారిపోయాయి. టీడీపీకి పట్టు తప్పి, వైసీపీకి ఎడ్జ్ వచ్చిందని రాజకీయ విశ్లేషుకులు చర్చలు చేశారు. కాకపోతే విశ్లుషుకుల చెప్పినట్లుగానే వైసీపీకి ఎడ్జ్ వచ్చింది.. కానీ దాన్ని ఉపయోగించుకునే స్టేజ్‌లో అక్కడి వైసీపీ ఇన్‌చార్జ్‌లు లేరని సమాచారం వచ్చింది.

 

ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారి మధ్య పెద్ద సమన్వయం లేదని తెలిసింది. వారు సమిష్టిగా కష్టపడితే విశాఖ నగరంపై వైసీపీకి మరింత పట్టు వచ్చేదని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడం కూడా వైసీపీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదే అంశాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని వైసీపీ గ్రిప్ తెచ్చుకుంటే బాగుంటుందని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తుంది. అయితే విశాఖ కార్పొరేషన్ ఎన్నిక జరిగే సమయానికి వైసీపీకి మరింత పట్టు పెరిగే అవకాశముందని, కార్పొరేషన్ సులువుగా వైసీపీ ఖాతాలో పడుతుందని అంటున్నారు. మరి చూడాలి కార్పొరేషన్ ఎన్నికలో ఎవరి పట్టు నిలుపుకుంటారో?

మరింత సమాచారం తెలుసుకోండి: