కాంగ్రెస్ పార్టీ తా‍త్కాలిక అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకి గురైన సోనియా గాంధీని ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేర్పిచినట్టు ఏఎన్ఐ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ‍ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే తాజా ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొందరు పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు.

 

అయితే ఈమెకి ఇది మొదటిసారి కాదు. గతంలో ఒకసారి వారణాసి రోడ్ షోలో వుండగా అస్వస్థతకి గురైన సోనియా గాంధీని హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ రిసెర్చ్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం గంగారామ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అనంతరం మరోసారి నవంబర్ మాసంలోనూ ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తరచు అనారోగ్యం బారిన పడుతుంటం పార్టీవర్గాలకు 
తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. అయితే కార్త్యకర్తలను, నాయకులను రాహుల్ సమన్వాయ పరిచినట్టుగా తెలుస్తోంది.

 

యెంత అనారోగ్యంగా వున్నా... ఆమె బి.జె.పి పైన విమర్శనాస్త్రాలను ప్రయోగిస్తూనే వుంది. ఇటీవల సీఏఏపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలను బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. స్వచ్ఛందంగా జరుగుతున్న నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందంటూ ట్విటర్ ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు.

 

1998 లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా  ఎన్నికైన సోనియా నిర్విరామంగా తన సేవలను పార్టీకి అందిస్తున్నారు. 2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు.  ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: