ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ పై వపన్ పంచ్‌ ల వశం కురిపించారు. ఎన్నికల చివరి సమయంలో పార్టీలోకి వచ్చి ఇప్పుడు తన పద్ధతులు బాగాలేవని విమర్శించి వెళ్లిపోయే వాళ్ల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు ఏంట్రా మాత్రం లేదని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్న వారెవరూ పార్టీ స్థాపించినప్పుడు లేరని గుర్తు చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తనతో ఉన్నది కేవలం జనసైనికులు, ఆడపడుచులేనని ఆయన తెలిపారు. 


జనసేనాని పవన్ కళ్యాణ్ పలు నియోజకవర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీని ముడి ఖనిజంగా వాడుకుని ఎదగాలనుకునే వారికి తాను అర్థం కానని జనసేనకు రాజీనామా చేసిన వారికి పంచ్ వేశారు. అలాంటి వారు తనను విమర్శించిన పట్టించుకోనని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అడ్డదారుల్లో వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించలేనని తెలిపారు. స్వశక్తితో సంపాదించిన డబ్బు వదులుకోవాలంటే సమాజంపై ప్రేమ, మనుషులపై గౌరవం ఉండాలని పేర్కొన్నారు. 


భవిష్యత్తులో మనల్ని ఇష్టపడే వారే ఎమ్మెల్యేలు అవుతారని పవన్ స్పష్టం చేశారు. అధికారం కోసం తాను అర్రులు చాచనని, అడ్డదారులు తొక్కనని, ఎవరి మోచేతి నీళ్లు తాగనని వ్యాఖ్యానించారు, ఏ ఆశయంతో పార్టీ పెట్టానో దాన్ని సాధించి తీరుతానని స్పష్టం చేశారు. కష్టాలు, నష్టాలు భరిస్తాను గానీ, విలువలు, జనసైనికుల నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోనని తెలిపారు. పార్టీ నిర్మాణం చాలా కష్టమైనదని, చాలా సహనంతో చేయాలన్నారు.


వ్యక్తిగత లాభమే చూసుకుంటే జనసేన పార్టీ పెట్టేవాడినే కాదని, బీజేపీలో చేరి కోరుకున్న పదవులు అనుభవించేవాడినని పవన్ వ్యాఖ్యానించారు. సమాజహితం కోరుకున్న వాడిని కాబట్టే దెబ్బలు తినడానికి సిద్ధపడి జనసేన పార్టీ పెట్టినట్లు పేర్కొన్నారు. జీవితంలో అధికారం వస్తుందో రాదో తెలియదని, కానీ ప్రజలు చూపించే అభిమానం ముందు అధికారం కూడా చిన్నదిగానే అనిపిస్తుందని తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: