దేశంలోనే ఎక్కువ మొత్తంలో ఖాతాదారులను కలిగి ఉన్న బ్యాంకింగ్ సంస్థ ఎస్బిఐ. ప్రస్తుతం రోజు ఒక కొత్త బ్యాంకు పుట్టుకొస్తున్న తరుణంలో ఎప్పటికప్పుడు తమ సేవలను పునరుద్ధరించుకుంటు కస్టమర్లకు వినూత్న  ఆఫర్ అని ప్రకటిస్తూ... మరోవైపు సెక్యూరిటీని పెంచుతూ రోజురోజుకు ఖాతాదారుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది ఎస్బిఐ. ప్రస్తుతం ఎస్బిఐ బ్యాంక్ అంటే ఫుల్లీ సెక్యూరిటీ బ్యాంక్ అని  ఖాతాదారులు అనుకుంటారు. ఎస్బిఐ కూడా వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ సరికొత్తగా కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు ఎస్బిఐ. 

 

 

 ఇక అటు సైబర్ నేరగాళ్ల నుంచి కూడా తమ కస్టమర్లను రక్షించేందుకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందిస్తూ... కస్టమర్లను సంతృప్తి పరుస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే ప్రస్తుతం ప్రతి బ్యాంక్ అకౌంట్ కి కేవైసి తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. కేవైసీ లేకుండా ఏ బ్యాంక్ అకౌంట్ కూడా సమర్థవంతంగా పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ కస్టమర్లను కెవైసి  అలర్ట్ చేస్తుంది. 

 

 

 బ్యాంక్ కస్టమర్ లందరూ వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుని హెచ్చరించింది. ప్రస్తుతం అన్ని బ్యాంకు అకౌంట్లకు కేవైసీ తప్పనిసరి అయింది అని.. ఈ నేపథ్యంలో ఈ నెల 28 లోపు కావాల్సిన పత్రాలను మీ దగ్గరలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో సంప్రదించి సమర్పించాలి  అంటూ సూచించింది .లేని  పక్షంలో బ్యాంక్ అకౌంట్ పనిచేయడం ఆగిపోతుంది అని తెలిపింది.  ఓటర్ ఐడి కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు లాంటి పత్రాలను ఏది ఇచ్చిన కేవైసీ చేస్తారు అంటూ  తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: