చైనాలో గుర్తించబడిన కరోనా  వైరస్ ప్రస్తుతం శర  వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాణాంతకమైన కరుణ వైరస్కు ఇప్పుడు వరకు సరైన వ్యాక్సిన్ కూడా కనిపెట్టకపోవడంతో... ఈ వైరస్ ఒకటే ప్రాణాలు పోవడం ఖాయం గా మారిపోయింది. ఇక రోజురోజుకు చైనాలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటికే కరోణ వైరస్ బారినపడి చైనాలో వందల సంఖ్యలో మరణిస్తే... వేల సంఖ్యలో కరోణ వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకును వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా కరోనా వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్న వారు కొంతమంది అయితే... ఎక్కడ కరుణ వైరస్ సోకుతుందో  అని భయపడుతున్న వారు కొంతమంది ఉన్నారు. 

 


 అయితే చైనాలో కరోనా  వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే చైనాకు వివిధ పనుల నిమిత్తం వెళ్ళిన భారత పౌరులను... రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కరోనా  వైరస్ సోకిన వాళ్ళు కానీ కరోనా  వైరస్ సోకని  వాళ్లను కానీ ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే చైనాకు విమానాలను కూడా పంపింది కేంద్ర ప్రభుత్వం. భారతీయులందరిని రక్షించేందుకు కీలక చర్యలు చేపట్టింది. మన దేశ పౌరులు అందరిని ఇండియాకు రప్పించేలా ఇప్పటికే.. రెండు అతిపెద్ద విమానాలను చైనాలో భారత పౌరులకు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కేవలం ప్రస్తుతం కరోనా  వైరస్ విషయంలోనే కాదు సిరియా దాడులప్పుడు కూడా భారత పౌరులని  రక్షించేందుకు చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. 

 


 ప్రస్తుతం చైనా కి భారత్ నుండి కాదు వివిధ దేశాల నుంచి పౌరులు వెళ్ళి వస్తూ ఉంటారు అన్న విషయం తెలుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి చైనాకు వెళ్ళిన పౌరులను రక్షించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే భారత పౌరులను  రక్షించేందుకు భారత దేశం నుంచి చర్యలు చేపడుతుంటే పాకిస్తాన్ పౌరుల కోసం పాకిస్థాన్ మాత్రం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అంటూ పాకిస్థాన్ పౌరులు   ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులకు కూడా భారత విమానాల్లో తరలిస్తూ సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు భారత్ పై పాకిస్తాన్ అక్కసును వెళ్లగక్కుతూ ... కాశ్మీర్ అంశం సహా పలు అంశాలపై విమర్శలు చేయడం లో ముందు ఉండటం కాదు... తమ దేశ పౌరులు అపాయంలో ఉన్నప్పుడు కాపాడేందుకు ముందుండాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: