టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ మైండ్ తో మీడియాను మేనేజ్ చేయడంలో దిట్ట అన్న  విషయం అందరికి తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు మీడియాని సరైన రీతిలో మెయింటెన్ చేసే ప్రతిపక్షం తీరును ఎండగట్టడం .. అదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ తీరును విమర్శిస్తూ కథనాలు రాయడం ఇలాంటివి ఇప్పటికి ఎన్నో సార్లు జరిగాయి కూడా. కేవలం స్థానిక మీడియా అనే కాదు జాతీయ మీడియాను వార్తాపత్రికలను కూడా చంద్రబాబు నాయుడు... కంట్రోల్  చేస్తారు అంటే అతిశయోక్తి లేదు.ఇక  2019 ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.

 

 ఇక అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అధికార వైసిపి పార్టీ వ్యతిరేకత తీసుకురావడానికి స్థానిక మీడియా పత్రికలు జాతీయ మీడియా ద్వారా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థానిక పచ్చ మీడియా వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చేలా కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. టిడిపి పార్టీకి అనుకూలంగా ఉండే స్థానిక మీడియా పత్రికలు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ పై వ్యతిరేకంగా ఎన్నో కథనాలు ప్రచారం చేశాయి. ఇక ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా జగన్ సర్కార్ పై వ్యతిరేక  కథనాలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. దీబట్టి చూస్తే స్థానిక మీడియా నే కాదు జాతీయ మీడియాను కూడా చంద్రబాబు కంట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి పార్టీ అనుచరులే జాతీయ మీడియాకు కూడా కథనాలు ప్రచారం చేస్తున్నారు ఉన్నది అందరూ అనుకుంటున్న మాట.

 


 అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారాన్ని సంపాదించి పెట్టడమే లక్ష్యంగా ఈ మీడియా సంస్థలు పని చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికార పార్టీ మాత్రం మీడియాని కంట్రోల్ చేస్తున్నట్టు  లేదు . ఏ మీడియా కి డబ్బులు ఇవ్వక పోవడం.. తమ ప్రభుత్వానికి మద్దతుగా కథనాలు ప్రచురించడం కానీ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా కథనాలు ప్రచారం చేయడం కానీ చేయడం లేదు అని వైసీపీ నేతలు అంటున్న మాట. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముక్కుసూటిగా ఎలాంటి అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారని ఏ మీడియాను కూడా మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు వైసీపీ నేతలు. మరి వైసిపి పార్టీ ఇలా ఉన్నప్పుడు..అటు  చంద్రబాబు నుంచి మాత్రం స్థానిక మీడియా నే కాకుండా జాతీయ మీడియా నుంచి వ్యతిరేకత కథనాలు రాయడం విమర్శలు రావడం మామూలే. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: