వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు ఏమాత్రం తగ్గడం లేదు. కొందరు టీడీపీ నేతలు మాత్రం అధికార పార్టీ నేతల తీరుపై చిత్ర విచిత్రమైన వాదనలతో విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జవహర్ ఒకరు. ఈయన ఇటీవల ఘాటైన పదజాలంతో వైసీపీ తీరుపై విరుచుకుపడుతున్నారు. అధికారంలోకి రాగానే మూడు వేలు పెన్షన్‌ ఇస్తామన్న తొలి హామీనే తుంగలో తొక్కి ప్రజల చేతుల్లో చీవాట్లు తిన్నా వైసీపీ నాయకులకు బుద్దిరాలేదంటూ మాజీ మంత్రి జవహార్ ఘాటుగా కామెంట్ చేశారు.

 

అంతే కాదు.. మంత్రి కొడాలి నాని వ్యవహార శైలిపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. వైసీపీ పెన్షన్ విధానాన్ని కొడాలి నాని సమర్థిస్తూ బూతు సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడటం సిగ్గుచేటంటూ అభ‌్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సన్నబియ్యంపై మాటతప్పి ప్రజలలో చులకనైనా కొడాలి నాని ఇంకా తీరు మార్చుకోకపోవడం సిగ్గుచేటని

మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యానించారు. గడిచిన 8 నెలలుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జగరోనా వైరస్‌ గురించి మాట్లాడకుండా కేవలం చంద్రబాబే లక్ష్యంగా కొడాలి నాని దిగజారుడు వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ మంత్రి జవహర్ అన్నారు.

 

టీవీల్లో మంత్రి కొడాలి నాని ప్రెస్‌మీట్‌ వస్తుంటేనే.. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఛానళ్లు మారుస్తున్నారని మాజీ మంత్రి జవహర్ తెలిపారు. ఆయన హావభావాలు మాయలపకీరును తలపించేలా ఉన్నాయి. అతను వాడుతున్న భాష, మాట్లాడుతున్న మాటలను చూసి యావత్‌ ప్రజానీకం ఛీదరించుకుంటోందని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు. చివరకు చట్టసభలలోనూ బూతు పదాలతో చరిత్రకే చెదలు పట్టించారన్నారు.

 

మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలకుగానీ, ఎమ్మెల్యేగా గుడివాడకు మాజీ మంత్రి జవహర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రజలను బెదిరించి, బాదించి, వేదించటమే ద్యేయంగా పనిచేస్తున్నారన్నారు. రోజురోజుకు ఉధృతమవుతున్న రాజధాని రైతుల ఆందోళనలతో మతిభ్రమించి.. ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్డం కావటం లేదని జవహర్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బాధ్యాతాయుతమైన మంత్రిపదవిలో ఉన్న కొడాలి నాని పద్దతిగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. లేదంటే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదని మాజీ మంత్రి జవహర్ హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: