ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. సీఎం జగన్ రాష్ట్రంలో నిరుద్యోగులకు మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉండటంపై నిరుద్యోగుల్లో కూడా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వానికి ఏపీ హోం శాఖ పరిధిలోని ప్రత్యేక రక్షణ దళం, పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, ఇతర విభాగాల్లో 15,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రతిపాదనలు అందాయి. 
 
ఈ 15,000 ఉద్యోగాలలో 11,000 ఉద్యోగాలు పోలీస్ శాఖలోని ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్ విభాగాలలో మరియు కానిస్టేబుల్ విభాగానికి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. మిగిలిన 4,000 పోస్టులు అగ్ని మాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఫైర్ మెన్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్, వార్డర్, ఎన్.ఎఫ్.సీలో కానిస్టేబుల్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. 
 
ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇప్పటికే ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వానికి అందించారు. ప్రతి సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగ క్యాలెండర్ ను విడుదల చేస్తామని దశల వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే . సీఎం జగన్ ఈ నెల మూడవ వారంలో అధికారులతో సమావేశమై అనంతరం ఉద్యోగ క్యాలెండర్ ను ప్రకటించుకున్నారని తెలుస్తోంది. 
 
అధికారుల నుండి 15,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రతిపాదనలు అందడంతో ఈ 15,000 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ నెల 21వ తేదీ తరువాత ఈ ఉద్యోగాల భర్తీ గురించి స్పష్టత రానుంది. జూన్ నెలలోపు ప్రభుత్వం ఈ ఉద్యోగాలను భర్తీ చేసి ఎంపికయిన వారిని విధుల్లోకి తీసుకోనుందని తెలుస్తోంది. కొన్ని ఉద్యోగాలకు ఇంటర్ అర్హతతో కూడా ధరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో నిరుద్యోగులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: