ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం.. తన పత్రికలో కొత్త పలుకు పేరుతో రాజకీయ విశ్లేషణ వ్యాసం రాస్తుంటారు. ఆయన తన పలుకుల్లో చంద్రబాబు అనుకూల వైఖరి, జగన్ వ్యతిరేఖ వైఖరి చూపిస్తుంటారన్నది మీడియా సర్కిల్లో అంతా చెప్పుకునే మాటే. అది బహిరంగ రహస్యమే. అయితే ఇటీవల ఈ పైత్యం మరీ ఎక్కువ అవుతుందన్న కామెంట్లు బాగా వినిపిస్తున్నాయి.

 

తాజాగా.. ఆయన రాసిన వ్యాసంలో కొన్ని కామెంట్లు చదువుతుంటే..రాధాకృష్ణ ఎటుపోతున్నాడో అన్న ఆందోళన మీడియా సర్కిళ్లలో వినిపిస్తోంది. కొంత మంది ప్రముఖులను కోట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఇంతటి సీనియర్ జర్నలిస్టు మరీ ఇంత పక్షపాతంగా.. ఒకరిపై బురద జల్లుతూ.. ఎలా రాస్తారా అనిపించకమానదు.

 

ఉదాహరణకు ఈ రాతలు చూడండి.. మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడట.. ఏపీకి అన్యాయం చేశానని రగిలిపోతున్నారట.. ఇవిగో ఆ వాక్యాలు.. చదివి మీరే నవ్వుకోండి.

 

జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘‘గత ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోవాల్సింది కాదు. కానీ నేను నా వ్యూహంతో ఎన్నికల వాతావరణాన్ని జగన్‌కు అనుకూలంగా మలిచాను’’ అని ఆయన పలువురి వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని విస్తృతంగా చేయడంతోపాటు చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేష భావాన్ని వ్యాపింపజేయడంలో ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు.”

 

‘‘జగన్మోహన్‌రెడ్డి పాలన ఇలా ఉంటుందని అనుకోలేదు. నేను చంద్రబాబుకే కాదు,ఆంధ్రప్రదేశ్‌కు కూడా అన్యాయం చేశాను’’ అని ఆయన ఇప్పుడు తీరిగ్గా వాపోతున్నారట.” ఇవీ ప్రశాంత్ పై ఆర్కే కామెంట్లు.. కామెడీ అదిరిపోలా..?

మరింత సమాచారం తెలుసుకోండి: