చైనాలోని వుహాన్  నగరంలో గుర్తించబడిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనాలో విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. అతి వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికీ వందల మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో కరోనా  వైరస్ బారినపడి ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇక వివిధ పనుల నిమిత్తం చైనా కు వెళ్ళిన భారతీయులు కూడా కొంత మంది అక్కడ కరోనా వైరస్ బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి... చైనాలోని ఊహన్  నగరంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కూతురికి త్వరలో వివాహం ఉందని వెంటనే స్వదేశానికి రప్పించండి అంటూ  అధికారులను కోరుతున్నారు. 

 

 

 వివరాల్లోకి వెళితే... కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు లో ఉండే ప్రమీల మహేశ్వర్ రెడ్డి కూతురు జ్యోతి. అయితే తండ్రి నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో.. బీటెక్ పూర్తి చేసిన జ్యోతి టిసిఎల్ లో మంచి ఉద్యోగం సాధించగా శిక్షణ నిమిత్తం... కంపెనీ ఉద్యోగుల లతో కలిసి చైనాలోని వుహాన్ నగరానికి వెళ్ళింది. ఇక అక్కడ ప్రస్తుతం కరోనా  వైరస్ విజృంభిస్తుండడంతో చైనా లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఈ క్రమంలోనే జ్యోతి సహచరులతో కలిసి ఊహన్ లోని  విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ వైద్యులు జ్యోతి కి పరీక్షలు నిర్వహించగా...జ్యోతి తో పాటు  శ్రీకాకుళంకు చెందిన మరో యువకుడికి కూడా  జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించి.. ఇండియా కు పంపేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో చైనాలోని ఊహన్  నగరంలో తాను పడుతున్న అవస్థలను సదరు యువతి ఓ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేసింది. 

 

 

 దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి,  ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్రెడ్డి కాటసాని రామిరెడ్డి లను కలిసి సమస్యను వివరించారు. అయితే ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి... జ్యోతిని స్వగ్రామానికి రప్పించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అయితే జ్యోతికి మహానంది మండలం తమ్మడపల్లి కు చెందిన అమర్నాథ్ రెడ్డి తో ఇటీవలే వివాహం నిశ్చితార్థం జరిగింది. ఇక వచ్చే నెలలో జ్యోతికి వివాహం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జ్యోతి చైనాలోనే ఊహన్ నగరంలో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. కాగా  జ్యోతిని త్వరగా స్వదేశానికి రప్పించాలి అంటూ అమర్నాథ్ రెడ్డి మీడియా ద్వారా అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: