కేంద్ర సర్వీసులో పని చేసుకుంటున్న తనకు కేవలం ఆరు నెలలు మాత్రమే సర్వీసు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్‌ పిలుపుతో ఆంధ్రప్రదేశ్‌కి సేవ చేసేందుకు ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి హోదాలో వచ్చాను. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే.. కంటిపై కునుకు రావటం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ తన సన్నిహితులతో చెబుతున్నారట. ఎప్పుడు ఏయే ఉత్తర్వులు జారీ చేయవలసి వస్తుందో నీలం సహాని ఉత్కంఠతో కనిపిస్తున్నారట. పాలకుల ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలను తప్పని సరిగా ఆచరించాలి। పాలకుల ఆదేశాలను తిరస్కరిస్తే।। బదిలీ చేసి పోస్టింగ్‌ ఇవ్వరు. కోర్టు ఆదేశాలను పాటించకుంటే.. కోర్టు దిక్కరణ కేసు కింద జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా వేయవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా కొనసాగే కంటే దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లి ప్రశాంతంగా రిటైర్డు అవ్వాలని నీలం సహాని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీలం సహాని భర్త అజయ్‌ సహాని 2014, 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎంవో ఇంఛార్జి అధికారిగా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. అజయ్‌ సహానికి మరో రెండేళ్లు సర్వీసు ఉంది. ఆంథ్ర రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అవగాహన లేకుండా.. తెలుసుకోకుండా..

ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా వచ్చినందుకు నీలం సహానికి గత సర్వీసులో ఎదురు కానీ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయట. నిత్యం టెన్షన్‌తో పని చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయట. అంతే కాకుండా సిఎంవోలో పని చేసే తన కన్నా జూనియర్‌ అధికారి ఆదేశాలను పాటించేందుకు ఆమె ఇష్టపడటం లేదట. దీంతో వారిద్దరి మధ్య మాట మాట పెరిగి వాద ప్రతివాదనలు జరిగాయని గతంలో బయటకు పొక్కింది.

అమరావతి రాజధాని నుండి విశాఖ నగరానికి ప్రభుత్వ కార్యాలయాలను తరలించాలని ముఖ్యమంత్రి జగన్‌తో పాటు ఇతర ముఖ్యులు ఒత్తిళ్లు తెస్తున్నారట. కోర్టు ఏమో అలాంటి పనులు చేయవద్దు.. చేస్తే మీకే నష్టం అన్నట్లు కోర్టు హెచ్చరించింది. కోర్టు, జగన్‌ మధ్య నీలం సహాని నలిగిపోతున్నారని అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళితే… కోర్టు ఆదేశాలను పాటించినట్టు ఉంటుందని ఆమె భావిస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: