బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి.. నిబంధనలను తప్పకుండా పాటించాలి.. సిగ్నల్ పడినప్పుడు ఆగాలి... ఇలాంటి నిబంధనలు ట్రాఫిక్ పోలీసులు పెడుతూ ఉంటారు. అయితే కొంత మంది మాత్రం ఇవ్వన్ని  నిబంధనలు ఉంటే ఏంటి.. మేం మాత్రం ఫాలో అవ్వం  అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి చాలామంది.. నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. హెల్మెట్ పెట్టుకుంటే హెయిర్ స్టైల్ చెరిగిపోతుంది అని కొంతమంది..  హెల్మెట్ పెట్టుకుంటే ఎలర్జీ వస్తుంది అని ఇంకొంతమంది ఏవో సాకులు చెబుతూ హెల్మెట్ పెట్టుకోకుండానే వాహనాలు నడుపుతూ ఉంటారు. 

 

 

 హెల్మెట్ ధరించ ని వారికి పోలీసులు జరిమానాలు విధించినప్పటికీ కూడా వారి తీరులో మార్పు రాదు. ఇక వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని వాహనాన్ని నడిపేల  అవగాహన కల్పించేందుకు సరికొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు పోలీసులు. సోషల్ మీడియా ద్వారా కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. అయితే మొన్నటి వరకు బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరి అనే నిబంధన ఉండేది. అయితే వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధన ఉన్నప్పటికీ పోలీసులు ఈ నిబంధనను అంతగా పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం బైక్ నడుపుతున్న వ్యక్తి తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. 

 

 

 బైక్ పై ఇద్దరు వెళ్లేటప్పుడు బైక్ నడుపుతున్న వ్యక్తి తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని హైదరాబాద్ పోలీసులు నిబంధన పెట్టారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించకపోతే వారికి వంద రూపాయలు జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ జరిమానాలు విధిస్తున్నారు. కాగా  అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనే ఉద్దేశంతో ట్రాఫిక్ పోలీసులు ఇలా జరిమానాలు విధిస్తున్న  విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: